రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి గతంతో పోలిస్తే కీలక మార్పులు చేసింది. ఇతరులకు చెక్ బుక్ జారీ చేసే సమయంలో ఖాతాలలో సరిపడా బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ప్రతిరోజూ 24 గంటలు నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని ఈ సంస్థ వెల్లడించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇకపై ఆదివారం రోజున కూడా చెక్ క్లియరెన్స్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నాచ్ సేవలు ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కూడా లభ్యమవుతూ ఉండటంతో ఖాతాదారులు ఖాతాలలో సరిపడా బ్యాలెన్స్ ఉంచుకుంటే మంచిది. చెక్ జారీ చేసిన సమయంలో సరైన బ్యాలెన్స్ లేకపోతే చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
చెక్ బౌన్స్ అయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకుంటే మంచిది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాచ్ సేవలను నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. ఎన్పీసీఐ వేతనాలతో పాటు పెన్షన్లు, డివిడెండ్లు, వడ్డీ చెల్లింపులు ఎన్పీసీఐ ద్వారానే జరగనున్నాయి. నాచ్ ద్వారా వాటర్, విద్యుత్, గ్యాస్, ఫోన్ బిల్లులను చెల్లించే అవకాశాలు ఉంటాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రభుత్వ నగదు బదిలీ పథకాలకు కూడా ఇదే విధానాన్ని పాటిస్తూ ఉండటం గమనార్హం. ఈ నిబంధనల వల్ల చెక్ ద్వారా లావాదేవీలు జరిపే వాళ్లకు మరింత ఎక్కువగా ప్రయోజనం చేకురనుంది.