Homeబిజినెస్Renault Triber Sales Cross 2 Lakh In India: ఆరున్నరేళ్లలో 2 లక్షల కార్ల...

Renault Triber Sales Cross 2 Lakh In India: ఆరున్నరేళ్లలో 2 లక్షల కార్ల సేల్స్.. ఇందులో విశేషం ఏంటంటే?

Renault Triber Sales Cross 2 Lakh In India: భారతదేశంలో కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. వివిధ అవసరాల నేపథ్యంలో చాలామంది సొంత కారును కలిగి ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఏ కారు కొనాలి? అన్న సందేహం కొందరిలో వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని రకాల ఫీచర్స్, సౌకర్యాలను ఉంచుతూ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. వీటిలో Renault కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన Triber విపరీతంగా ఆకట్టుకుంది. అయితే దీని సేల్స్ ఇటీవల 2 లక్షలు దాటాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

7 సీటర్ వేరియంట్ లో రెనాల్ట్ కంపెనీకి చెందిన ట్రైబల్ 2019లో మార్కెట్లోకి వచ్చింది. గత ఆరున్నర సంవత్సరాల్లో ఈ కారుకు విశేష ఆదరణ లభిస్తుంది. పరిశ్రమల లెక్కల ప్రకారం.. 2026 జనవరి చివరి వరకు ఈ కారు 2,00,253 సేల్స్ నమోదు చేసుకుంది. 2025 జూలై నుంచి ఫేస్ లిఫ్టు వేరియంట్ కు 56% అమ్మకాలు పెరిగాయి. ఇందులో భాగంగా 2025 డిసెంబర్ వరకు మరో 34,238 యూనిట్లను ఎగుమతి చేసింది. రెనాల్ట్ ట్రైబర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 2021 ఆర్థిక సంవత్సరానికి 40,956 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. ఆ తర్వాత 2022 సంవత్సరంలో 27% అమ్మకాలు తగ్గాయి. కానీ 2023 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ 32, 664 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకొని 10 శాతం వృద్ధి సాధించింది. ఈ విధంగా ఆరున్నర సంవత్సరాల్లో ఈ కంపెనీ 2 లక్షల మైలురాయిని దాటింది.

అయితే రెనాల్ట్ ట్రైబర్ కు డిమాండ్ రావడానికి కారణం లేకపోలేదు. ఈ కంపెనీకి చెందిన ఏకైక MPV ని 2025 జూలై 3న ప్రారంభించారు. అలాగే ఇది లేటెస్ట్ గా కాంపాక్ట్ MPV గా మారిపోయింది. కొత్తగా వచ్చిన మోడల్ కంటే ఇప్పుడు ఉన్న మోడల్ పూర్తిగా నేటి తరం వారికి అనుగుణంగా ఉంది. ఇందులో LED హెడ్ లాంప్స్ ఆధునికరించబడ్డాయి. అలాగే కొత్త Triber 1.0 లీటర్ పెట్రోల్ 3 సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 72 హార్స్ పవర్, 96 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో నడుస్తుంది. లీడర్ ఇంధనానికి 19.59 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఇందులో CNG ఆప్షన్ కూడా ఉండడం విశేషం. అలాగే 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్లెస్ వంటి ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కారును రూ. 5,76,000 ధరతో విక్రయిస్తున్నారు. అంతకుముందు రూ.6,30,000 ఉండేది. ఇటీవల దీనిపై రూ.54,000 తగ్గించారు. మొత్తంగా రెనాల్ట్ ట్రైబర్ ప్యాసింజర్ అమ్మకాలు సంవత్సరానికి మూడు శాతం పెరుగుదల కనిపిస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version