Renault Triber Offer: భారత్ లో కార్ల కొనుగోళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు తమ సేల్స్ ను మరింత పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో (Renault) బంఫర్ ఆఫర్లను ప్రకటించింది. తన పాపులర్ మోడల్స్ అయిన కైగర్ (Kiger), ట్రైబర్ (Triber), క్విడ్ (Kwid) కార్లపై ఊహించని డిస్కౌంట్లను ప్రకటించింది.ఈ కార్లు కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 1.25 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
రెనో కంపెనీ జూలై నెల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్యూవీ మోడల్ రెనో కైగర్ పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ కారుపై గరిష్టంగా రూ. 1.25 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే డిస్కౌంట్ కేరళ రాష్ట్ర వినియోగదారులకు వర్తిస్తుంది. ఇందులో రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 25,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్, రూ. 18,000 వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి. గుజరాత్లో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్ , రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుండగా, మిగిలిన రాష్ట్రాల్లో రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ తో పాటు అర్హతను బట్టి స్క్రాపేజ్, లాయల్టీ ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ కంపెనీకి చెందిన 7-సీటర్ MPV రెనో ట్రైబర్ పై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్‌పై కేరళలో గరిష్టంగా రూ. 60,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. గుజరాత్ కస్టమర్లకు రూ. 45,000 వరకు ఆఫర్లు లభిస్తుండగా, తెలుగు రాష్ట్రాలతో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) సహా దేశంలోని ఇతర రాష్ట్రాల కొనుగోలుదారులు రూ. 30,000 వరకు (రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ , రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్) ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటు కార్పొరేట్ డిస్కౌంట్లు, రూరల్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన రెనో క్విడ్ (2026 MY) కొత్త మోడల్ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 15,000 వరకు క్యాష్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అయితే ఈ రూ. 15,000 ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, అస్సాం, ఒడిశా వంటి కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల్లో వర్తించదు. ఒకవేళ మీరు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న పాత మోడల్ క్విడ్ కార్లను ఎంచుకుంటే, స్టాక్ లభ్యతను బట్టి ఏకంగా రూ. 30,000 వరకు మరింత మెరుగైన క్యాష్ డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంది.
ఈ ఆఫర్లు 31 జూలై 2026 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. వాహనాల వేరియంట్లు, రంగులు, స్థానిక డీలర్‌షిప్‌ల వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఈ డిస్కౌంట్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వారు సమీపంలోని రెనో షోరూమ్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.
