https://oktelugu.com/

Renault Duster 2023: రెనాల్ట్ డస్టర్ మళ్లీ వస్తోంది.. ఈసారి అంతకుమించి.. రీ డిజైన్.. అప్డేట్ ఫీచర్స్ ధర ఎంతంటే?

దేశీయ కార్ల ఉత్పత్తిలో రెనాల్ట్ కూడా పోటీ పడుతుంది. ఈ కంపెనీ నుంచి 2012లో కాంపాక్ట్ ఎస్ యూవీగా ‘డస్టర్’ పేరుతో మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 27, 2023 4:49 pm
    Renault Duster 2023

    Renault Duster 2023

    Follow us on

    Renault Duster 2023: భారత్ లో ఉండేవాళ్లలో చాలా మంది కారును సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కార్లు కనిపించేవి. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా సొంత కారు ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు సైతం వివిధ మోడళ్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం హ్యాచ్ బ్యాక్ కార్లతో మాత్రమే సంతృప్తి చెందిన చాలా మంది ఇప్పుడు SUVలను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పదేళ్ల కిందట రోడ్లపై తిరిగి సంచలనం సృష్టించిన కారు రీ డిజైన్ చేసుకొని వచ్చే నెలలో SUVగా రూపాంతరం చెంది మళ్లీ మార్కెట్లోకి రాబోతోంది. మరి దీని విశేషాలేంటంటే?

    దేశీయ కార్ల ఉత్పత్తిలో రెనాల్ట్ కూడా పోటీ పడుతుంది. ఈ కంపెనీ నుంచి 2012లో కాంపాక్ట్ ఎస్ యూవీగా ‘డస్టర్’ పేరుతో మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. ఆ సమయంలో రెనాల్ట్ ఫీచర్స్ 1.5 లీటర్ పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ తో సహా రెండు పవర్ ట్రైన్ లతో అందించింది. 5 స్పీడ్ మాన్యువల్ , 6 స్పీడ్ సీవీటి యూనిట్ ను కలిగి ఉంది. ఇలా 10 సంవత్సరాల పాటు వినియోగదారులను ఆకర్షించిన ‘డస్టర్’ 2022 ఏప్రిల్ లో దాని ఉత్పత్తిని నిలిపివేశారు.

    ఇదే డస్టర్ ను రీ డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. కొత్త డస్టర్ ను సీఎంఎఫ్-బీ మాడ్యులర్ ఫ్లాట్ ఫాంపై అభివృద్ధి చేశారు. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ శక్తివంతంగా తయారైంది. అలాగే 167.6 బీహెచ్ పీ పవర్, ఇతర ఇంజన్లలో 109 బీహెచ్ పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ తో పాటు 1.2 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంిజన్ ను 118 బీహెచ్ పీ, 138 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

    కొత్త డస్టర్ ను వచ్చే నెల 29న పోర్చుగల్ లో ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోనూ రిలీజ్ చేస్తారు. అయితే భారత మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు అని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎస్ యూవీలను కోరుకుంటున్న చాలా మందికి డస్టర్ మంచి ఆప్షన్ అని అంటున్నారు. అయితే భారత్ లో రిలీజ్ అయ్యే నాటికి కొత్త డస్టర్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక పాత డస్టర్ రూ.8 లక్షల ఎక్స్ షో రూం ధర ఉండేది. ఆన్ రోడ్ రూ.14.25 లక్షల వరకు విక్రయించారు. అయితే కొత్త డస్టర్ ఈ రేంజ్ లోనే ఉంటుందని భావిస్తున్నారు.