Reliance: ఒకప్పుడు చాలా చిన్న సంస్థగా ప్రారంభమై రియలన్స్ సంస్థ ప్రస్థానం ఇప్పుడు అనేక రంగాలకు విస్తరించింది. రిలయన్స్ సంస్థ అలా అంచెంలంచెలుగా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు తానే అవకాశాలను సృష్టించుకుని మరీ ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల కాలంలో రిలయన్స్ సంస్థ తన వ్యూహాలను మార్చుకున్నట్లుగా కనబడుతోంది. ఒకప్పుడు అన్నీ తానే స్టార్ట్ చేయాలని భావించిన కంపెనీ ఇటీవల కాలంలో అలా చేయడం లేదు.

తన వ్యూహాన్ని మార్చుకుని వివిధ కంపెనీల్లో పెట్టుబడులకు ఓకే చెప్పేసింది రిలయన్స్ సంస్థ. ఈ క్రమంలోనే టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ఆయా రంగాల్లోని ఇతర కంపెనీలతో కలిసి ముందకు వెళ్లాలని రిలయన్స్ సంస్థ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే గడిచిన నాలుగేండ్లలో దాదాపు రూ.42వేల కోట్ల పెట్టుబడులు పెట్టేసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇతర గ్లోబల్ కంపెనీల్లాగా మంచి రేటు రాగానే వాటాలు అమ్ముకోకుండా కంపెనీ డెవలప్ మెంట్‌కోసం కృషి చేస్తోంది రిలయన్స్. అదే ప్లస్ గా మారింది.
Also Read: శృంగార తారతో రవితేజ స్టెప్పులు.. ఏమిటి ఈ దౌర్భాగ్యం ?
ఇటీవల మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ హోటల్‌లో 73.3 శాతం వాటా కొనుగోలు చేసింది.డెలివరీ ప్లాట్ ఫాం డుంజోలోనూ 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్, ఫ్యూచర్ సంస్థ మధ్య ఉన్న న్యాయపరమైన ఇష్యూస్ సాల్వ్ అయితే ఫ్యూచర్ గ్రూపు రిటైల్ బిజినెస్‌లో రిలయన్స్ పెట్టుబడులు 9 బిలియన్ డాలర్లకు(రూ.66.60వేల కోట్లు) రీచ్ అవుతాయి. అదే గనక జరిగితే రిలయన్స్‌కు మరింత లాభం చేకూరుతుంది.
గత దశాబ్ధ కాలంగా ఇలా పెట్టుబడులు పెడుతున్నా కూడా.. ఈ నాలుగేండ్లలోనే వీటిని పెంచేసింది. ఇతర గ్లోబల్ కంపెనీలతో పోటీ పడుతూ వీలైతే కంపెనీలను మొత్తం కొనేస్తోంది. రిలయన్స్ సంస్థ ఇలా లేటుగా వచ్చినా సరే.. లేటెస్ట్ గా వచ్చేట్లు ప్లాన్ చేసుకుంది. ఈ క్రమంలోనే సంస్థ గ్లోబల్ ప్లేయర్స్‌తోనూ పోటీ పడుతోంది.విదేశీ పెట్టుబడి సంస్థలకూ రిలయన్స్ గట్టి పోటీ ఇస్తున్నది. మొత్తంగా రిలయన్స్ సంస్థ గత నాలుగేళ్ల నుంచి కొనుగోళ్లు, పెట్టుబడుల ప్రస్థానం స్టార్ట్ చేసింది.
అలా రిలయన్స్ సంస్థ దీర్ఘకాల లక్ష్యంతోనే తన వ్యూహాన్ని ఇలా మార్చుకున్నదని అర్థమవుతున్నది వాణిజ్య నిపుణులు చెప్తున్నారు. ఇక గతేడాది 1.8బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేసింది. గతేడాది ఫ్యాషన్, డిజైన్ రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యూత్ ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్న ఈ రంగాలపై దృష్టి సారించింది. అందుకు ఈ తరహా కంపెనీల్లో కూడా బాగానే పెట్టుబడులు పెడుతోంది. ఇక బట్టల వ్యాపారంలో కూడా దూసుకుపోయేందుకు పక్కా ప్లాన్లు వేసుకుంటోంది. ఎక్కువగా టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లోనే ఈ సంస్థ పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఇంధన సామ్రాజ్యం నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు కూడా అడుగులు వేస్తోంది. ఇలా అనుబంధ రంగాల్లో రాణిస్తున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతోంది రిలయన్స్. భాగస్వాములతో చేతులు కలిపి తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకుంటోంది.
Also Read: చిరుతో రవితేజ.. టికెట్ రేట్లు పై ఏపీ మంత్రులతో మాట్లాడతాడట
[…] […]