Homeఆంధ్రప్రదేశ్‌Andhra-Telangana: తెలంగాణ విద్యుత్ బ‌కాయిలు ఇవ్వాలంటున్న ఏపీ.. కేంద్రం వ‌ద్ద పంచాయితీ..

Andhra-Telangana: తెలంగాణ విద్యుత్ బ‌కాయిలు ఇవ్వాలంటున్న ఏపీ.. కేంద్రం వ‌ద్ద పంచాయితీ..

Andhra-Telangana: తెలుగు రాష్ట్రాలు విడిపోయి చాలా కాలం అయిపోయినప్పటికీ ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వద్ద పంచాయతీ త్వరలో జరగబోతున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి రావాల్సిన నిధులను అత్యవసరంగా ఇప్పిస్తే ఇప్పటికి చాలన్నట్లుగా ఏపీ సర్కారు ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు.

Andhra-Telangana
Andhra-Telangana

తెలంగాణ, విభజిత ఏపీ మధ్య ఉన్న ఉమ్మడి సంస్థలు, విద్యుత్ బకాయిల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ప్రధానంగా పట్టుబట్టాలని ఏపీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, విజయ డెయిరీ లాంటి సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించనున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్పొరేషన్, దీనికి అనుబంధంగా ఉన్న ఏపీ హెవీ మిషనరీ అండ్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌‌ల విభజన అంశం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

Also Read:  ఇద్దరు నటులపై ఎఫ్ఐఆర్ నమోదు.. పట్టింపేదీ?

ఇకపోతే తెలంగాణ సర్కారు ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలపై ఏపీ ఎన్నో ఆశలు పెట్టుకుందట. తెలంగాణ డిస్కంల నుంచి తమకు రూ.7,500 కోట్లు వస్తాయని ఏపీ అంటోంది. ఈ విషయమై హైకోర్టులో కేసు కూడా వేసింది. అయితే, తెలంగాణ మాత్రం ఏపీనే తమకు ఇవ్వాలని వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే విభజన చట్టానికి అనుగుణంగా అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఇరు రాష్ట్రాల అధికారులు అంటున్నారు.

కేంద్రం కూడా పెద్దన్న మాదిరిగా ఇరు రాష్ట్రాల వాదనలు విని.. సమస్య పరిష్కారించాల్సి ఉంటుంది. అయితే, కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదని అంటున్నారు అధికారులు. ఈ సారి సమావేశంలోనూ అంతే ఉంటుందా? లేదా ఏదేని నిర్ణయం కేంద్రం తీసుకుంటుందా అనేది చూడాలి. కేంద్రం ఏపీ, తెలంగాణ ప్రభుత్వ వాదనలన విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది. విభజన సమస్యలపై గతంలో కేంద్ర హోం శాఖ అధికారులు ఇరు రాష్ట్రాల వాదనలు విన్న సంగతి తెలిసిందే.

Also Read: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు ఎందుకొచ్చారు?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Hero Movie: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గల్లా అశోక్ కు ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఆశీస్సులు ఉన్నాయి. ‘హీరో’ మూవీతోనే గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతుంటం విశేషం.  ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా చేసుకున్న ‘హీరో’ మూవీ జనవరి 15న థియేటర్లలో వచ్చేందుకు ముస్తాబైంది. […]

Comments are closed.

Exit mobile version