Redmi Note 15: కొత్తగా మొబైల్ కొనాలని అనుకునేవారు కొందరు తక్కువ ధరలో కొనాలని చూస్తారు. అయితే ధర తక్కువగా ఉండి అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లతో పాటు మెరుగైన బ్యాటరీ, కెమెరాలు అందించే కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో Redmi కంపెనీ ఒకటి. మధ్యతరగతి ప్రజలు మంచి ఫీచర్స్ కలిగిన మొబైల్ తక్కువ ధరలో పొందాలంటే ఈ కంపెనీకి చెందిన డివైస్ లు మార్కెట్లో ఎన్నో రకాలుగా ఉన్నాయి. అయితే ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వినియోగదారులకు అనుగుణంగా కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా Redmi Note 15 5G ని ప్రవేశపెట్టింది. ఈ మొబైల్లో అడ్వాన్స్ కెమెరా తో పాటు బలమైన బ్యాటరీ ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా నాణ్యమైన వీడియోలను చూసేందుకు శక్తివంతమైన డిస్ప్లే కూడా ఇందులో అమర్చారు. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Redmi Note 15 5G గురించి ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ మొబైల్ గురించి ఆన్లైన్లో తెలిపిన వివరాల ప్రకారం ఇందులో అద్భుతమైన డిస్ప్లేను అమర్చారు. 6.77 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండడంతో నాణ్యమైన వీడియోలను ఇందులో అద్భుతంగా చూడవచ్చు. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేయడంతో మూవీస్ తో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే పై ప్రత్యేకంగా రక్షణ కవచం ఉండడంతో ఫింగర్ ప్రింట్స్, దుమ్ము ధూళి వంటివి వెంటనే తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ సిక్స్ జెన్ 3 ప్రాసెసర్ను అమర్చారు. దీంతో వేగంగా బ్రౌజింగ్ చేసుకోవాలని అనుకునే వారికి ఫుల్ సపోర్ట్ తో పనిచేస్తుంది.
ఈ మొబైల్లో కెమెరాను ప్రధానంగా చెప్పుకోవచ్చు. 108 MP మెయిన్ కెమెరాను ఇందులో సెట్ చేశారు. సెల్ఫీల కోసం 20 MP కెమెరా ఉండనుంది. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారితోపాటు సెల్ఫీ ఫోటోలు, వీడియో కాలింగ్ చేసుకునే వారికి క్వాలిటీ వీడియో అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా 4k వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఏఐ తరహాలో వీడియోలను కూడా తయారు చేసేందుకు సపోర్ట్ ఇస్తుంది.
ఈ మొబైల్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. కర్వ్డ్ డిజైన్తో యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఆన్లైన్లో విక్రయాలను ప్రారంభించిన ఈ మొబైల్ ను చూసి చాలామంది కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. రోజువారీ వినియోగదారులకు బ్యాటరీ కూడా ఫుల్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది.
