Xiaomi Redmi 17 launch date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi తన సబ్ బ్రాండ్ రెడ్‌మి నుండి సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. టెక్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రెడ్‌మి నోట్’ సిరీస్‌లో తదుపరి తరం మోడల్స్ రాబోతున్నాయి. తాజా లీకుల ప్రకారం.. కంపెనీ రెడ్‌మి నోట్ 16 సిరీస్‌ను దాటవేసి, నేరుగా రెడ్‌మి నోట్ 17 సిరీస్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ సీరిస్ లోని ఫోన్లు ఎలా ఉండబోతున్నాయంటే..
షియోమీ 17 సిరీస్ నుంచి వచ్చే నోట్ 17 ఫోన్ లో బ్యాటరీ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఏకంగా 9,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఉంచారు. అలాగే ఈ సిరీస్‌లో ‘ప్రో మాక్స్’ (Redmi Note 17 Pro Max) మోడల్ మరింత శక్తివంతమైన 10,000mAh బ్యాటరీతో తవిడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్ లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన స్నాప్‌డ్రాగన్ 6-సిరీస్ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించబోతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఇది ఇటీవలే విడుదలైన పవర్‌ఫుల్ అండ్ ఎఫిషియంట్ చిప్ అయిన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 కావచ్చు. ఈ ప్రాసెసర్ బ్యాటరీ వినియోగాన్ని చాలా వరకు ఆదా చేస్తుంది, దీనివల్ల 9,000mAh బ్యాటరీ బ్యాకప్ మరింత అద్భుతంగా, రోజుల తరబడి వచ్చేలా ఉంటుంది.
ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. మల్టీమీడియా లవర్స్ కోసం ఇందులో హై-వాల్యూమ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అమర్చారు. ప్రమాదవశాత్తు కిందపడినా పగలకుండా ఉండేలా డ్రాప్ రెసిస్టెన్స్, అలాగే ఫ్లాగ్‌షిప్ స్థాయి వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ (వాటర్‌ప్రూఫ్ రేటింగ్) తో ఈ మిడ్-రేంజ్ ఫోన్ రాబోతోందని తెలుస్తోంది.
ఈ సరికొత్త రెడ్‌మి నోట్ 17 సిరీస్ ఫోన్ మొదట చైనా మార్కెట్లో వచ్చే నెల, అంటే జూలై 2026 లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టనుంది. కేవలం మిడ్-రేంజ్ బడ్జెట్‌లోనే లభించే ఈ రెడ్‌మి నోట్ సిరీస్‌లో ఇలాంటి భారీ బ్యాటరీ మరియు ప్రీమియం ఫీచర్లు రానుండటంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
