Recycling Business: ఈ భూమిపై ఎన్నో పనికిరాని వస్తువులు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చుకుని సులభంగా ఆదాయం సంపాదించవచ్చు. భూమిపై రోజురోజుకు వ్యర్థాలు పెరిగిపోతున్నాయనే సంగతి తెలిసిందే. వ్యర్థాల నిర్వహణ చాలా సమస్యలతో కూడుకుందని చాలామంది భావిస్తున్నారు. వ్యర్థాల్లో ఉన్న ప్లాస్టిక్ భూమిలో కలవాలంటే కొన్నివేల సంవత్సరాల సమయం పడుతుంది.
కొన్ని స్టార్టప్ కంపెనీలు వ్యర్థాల సహాయంతో ఎకో ఫ్రెండ్లీ వస్తులను తయారు చేస్తున్నాయి. వ్యర్థాలతో రీసైక్లింగ్ బిజినెస్ చేయడం ద్వారా సులభంగా లక్షల్లో సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్ కు చెందిన వేణు గోపాల్, మాధవి ఎకో ఫ్రెండ్లీ విస్తరాకులతో పాటు ఇతర వస్తువులను తయారు చేస్తున్నారు. రోజురోజుకు ప్రజల్లో తమ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని ఈ జంట చెబుతున్నారు.
ప్రస్తుతం ఫర్నిఛర్ వినియోగం ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. పూణెకు చెందిన ప్రదీప్ జాదవ్ పాత టైర్లు, బ్యారెల్స్ ను ఉపయోగించి ఫర్నిచర్ వస్తువులు తయారు చేస్తున్నారు. కుర్చీలు, టేబుల్, అల్మారాలను తయారు చేసి గిగాంటిక్స్ ఫర్నిచర్ పేరుతో విక్రయిస్తున్నారు. శ్రమ ఎక్కువైనా లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయని ప్రదీప్ జాదవ్ వెల్లడిస్తున్నారు. ముంబైకు చెందిన రీటా క్యారీ బ్యాగ్స్ తో మ్యాట్స్, బ్యాగ్స్ తయారు చేసి ఆన్ లైన్ వేదికగా అమ్ముతున్నారు.
ఢిల్లీకి చెందిన సిద్ధాంత్ కుమార్ డెనిమ్ తో అప్‌సైక్లింగ్ చేసే పనులను మొదలుపెట్టారు. లాంతర్లు, పెన్ హోల్డర్ను డెనిమ్ తయారు చేసి ఈ వ్యక్తి భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం చేయాలనుకునే వాళ్లకు ఈ వ్యాపారం బెస్ట్ వ్యాపారం అని చెప్పవచ్చు.