Narzo 70 Pro 5g: ప్రముఖ చైనా మొబైల్స్ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme) బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. కేవలం రూ.20,000 బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో 5Gని తీసుకొస్తోంది. ఈ ఏడాది మార్చిలో ‘నార్జో 70 ప్రో 5G’ (Narzo 70 Pro 5G)ని లాంచ్ చేసింది. ఇంత తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించింది. నార్జో 70 ప్రో 5G 8GB RAM + 256 GB ROM ఒరిజినల్ కాస్ట్ రూ.26,999. తాజా ఆఫర్‌లో దీన్ని రూ.21,999కే కొనవచ్చు. 8GB RAM + 128 GB ROM మోడల్ లాంచింగ్ ప్రైస్ రూ.24,999 ను రూ.16,999కి తగ్గించింది.
రియల్‌మీ సేవింగ్స్ డే
‘నార్జో 70 ప్రో 5G’ ఈ ఏడాది 2024, మార్చి 19న లాంచై 22న సేల్ కు వచ్చింది. రియల్‌మీ బిగ్ ‘సేవింగ్స్ డే’ సందర్భంగా, ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సేల్ ఈ రోజు (జూన్ 7) మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. ఈ ఫోన్‌ను Realme.com, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. నార్జో 70 Pro 5G 8GB+128GB ROMపై రూ.3,000, 8GB+256GB ROMపై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.
అమెజాన్ లో..
ఈ డిస్కౌంట్ తర్వాత 8GB+128GB ROM రూ.16,999కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో దీని ధర రూ.24,999గా ఉంది. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది. అర్ధరాత్రి వరకే డిస్కౌంట్లు వర్తిస్తాయి.
ఫీచర్లు
రియల్‌మీ ‘నార్జో 70 ప్రో 5G’లో 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. FHD+ రిజల్యేషన్ వీడియోలను క్లారిటీగా చూడవచ్చు. థిన్ బెజెల్స్, పంచ్-హోల్ డిస్‌ప్లే ఉన్న ఫ్లాట్-స్క్రీన్ డిజైన్‌తో స్లిమ్‌గా ఉంటుంది. వెనుక హారిజాన్ గ్లాస్ డిజైన్, సాఫ్ట్ & మాట్ ఫినిష్ ఆఫర్ చేశారు.
హై అండ్ క్వాలిటీ ప్రాసెసర్..
ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. Mali-G 68 GPU స్టాండర్డ్‌తో లైట్, ఈ ఫోన్ మీడియం లెవల్ గేమ్స్ ఆడుకునేందుకు సపోర్ట్ చేస్తుంది. 50-MP సోనీ IMX890 మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 2X ఇన్ సెన్సార్ జూమ్‌తో క్వాలిటీ వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియోల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు.
బెస్ట్ బ్యాటరీ..
ఇందులో 5000mAh బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఇది 67W సూపర్‌వోక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫుల్ డే బ్యాకప్ వస్తుంది. టచ్‌లెస్ కోసం ఎయిర్ జెస్టర్స్ కంట్రోల్స్ ఇచ్చారు. హెవీ యూసేజ్ సమయంలో హీట్ ను సమర్థవంతంగా తగ్గించేందుకు 3D VC కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎయిర్ గెస్చర్ కంట్రోల్స్‌తో ఫోన్‌ను తాకకుండానే కంట్రోల్ చేయవచ్చు.