Realme P4x: ఇప్పుడున్న యూత్ దాదాపు ప్రతిరోజు ఫోన్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలాంటివారు ఫోన్లో మెరుగైన బ్యాటరీ ఉండే విధంగా చూసుకుంటున్నారు. అటు కార్యాలయ అవసరాల తోపాటు వివిధ అవసరాల కోసం ఫోన్ ఉపయోగించేవారు కూడా బ్యాటరీ బాగుండాలని అనుకుంటున్నారు. వీరి కోసం Realme P4 x అనే మొబైల్ ను అందుబాటులో ఉంచింది. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా దీనిపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాకుండా ఇందులో డిస్ప్లే, కెమెరా ఫీచర్స్ బాగుండడంతో దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఇందులో ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Realme కంపెనీకి చెందిన మొబైల్స్ ఎప్పుడు మిడ్ రేంజ్ పీపుల్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే P4x కూడా తగ్గింపు ధరతో ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ముందుగా దీని ఫీచర్ల విషయానికి వెళ్తే. ఇందులో 6.72 అంగుళాల FHD డిస్ప్లే ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. 1000 nits బ్రైట్నెస్ కూడా అందిస్తుంది. ఇందులో మీడియా టెక్ demensity ఆల్ట్రా ప్రాసెసర్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.
ప్రతి మొబైల్ లో కెమెరా ప్రధానంగా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ తో పాటు యూత్ కు అనుగుణంగా కెమెరాను ఉంచుతున్నారు. అలాగే ఇందులో కూడా 50 MP ప్రైమరీ కెమెరాను ఉంచారు. అలాగే 2 ఎంపీ మోనోక్రోమ్ రియర్ కెమెరా పనిచేయనుంది. సెల్ఫీ కోసం 8 mp కెమెరా పనిచేస్తుంది. పగలు, రాత్రి అని తేడా లేకుండా అన్ని సమయాల్లో క్వాలిటీ ఫోటోగ్రఫీ అందిస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 7,000 mAh బ్యాటరీ చర్చారు. ఇది 45 W అల్ట్రా పవర్ తో చార్జింగ్ చేసుకోవచ్చు. ఫాస్టెస్ట్ చార్జింగ్ కావాలని కోరుకునే వారికి ఇది ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ కొత్త మొబైల్ లో 6 జిబి నుంచి 8జిబి వరకు ర్యామ్ పనిచేసే అవకాశం ఉంది. అలాగే 128 జీబీ నుంచి 256 జిబి వరకు స్టోరేజ్ స్పేస్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ కోసం ఫుల్ సపోర్ట్ ఉంటుంది.
అమెజాన్ ఆన్లైన్ సంస్థలో దీనిని సాధారణంగా రూ.17,999 కి విక్రయించారు. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా దీనిపై రూ. 2,000 వరకు తగ్గింపు ప్రకటన చేశారు. బ్యాంక్ కార్డు ఉన్నవారికి మరింతగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండడంతో ఒకేసారి డబ్బు మొత్తం పెట్టలేం అనేవారికి కూడా ఇది అనుగుణంగా ఉంటుంది.