Realme: మిడ్ రేంజ్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు Realme కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్స్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఫోన్ యూజర్స్ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే రోజువారి వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో ఫీచర్స్ అప్డేట్ అయినా మొబైల్ పై ఆసక్తి చూపుతారు. ఇలాంటి సమయంలో ఈ కంపెనీ లేటెస్ట్ గా Neo 8 Infinite Edition అనే సిరీస్ ను కొత్తగా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన నియో 7 సిరీస్ ను అప్డేట్ వెర్షన్ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా 8 వెర్షన్ అప్డేట్ చేయనుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా విడుదల చేయనప్పటికీ.. ఈ మొబైల్ కి సంబంధించిన సమాచారం ఆన్లైన్లో కనిపిస్తుంది. ఈ మొబైల్ వివరాలు ఎలా ఉన్నాయంటే..?
Realme కంపెనీ కొత్తగా తీసుకొచ్చే Neo 8 Infinite Edition డిస్ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లేను చూడవచ్చు. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇది 1.5 K resolution ఉండడంతో రింతగా బ్రైట్నెస్ గా ఉండడంతో వీడియోలు చూసేందుకు ఒత్తిడి తగ్గుతుంది. అలాగే గేమింగ్ కోరుకునే వారికి ఆకట్టుకునే విధంగా కలరింగ్ తో డిస్ప్లే అవుతుంది. ఈ సిరీస్లో 8 జెన్ 5 ఉండే అవకాశం ఉంది. ఇది 3 nm టెక్నాలజీతో పనిచేస్తుంది.
ఈ మొబైల్ లో ఆకట్టుకునే హై రిజల్యూషన్ తో కూడిన కెమెరాలు అమర్చారు. ఇది ప్రధానంగా 50 MP కెమెరా ఉంది. అలాగే 3D అల్ట్రా సోనిక్ కెమెరా కూడా ఉండడంతో కావాల్సిన ఫోటోగ్రఫీ అందిస్తుంది. 4k వంటి వీడియోలను కూడా రికార్డు చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కావాలనుకునే వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో 8,000 mAh బ్యాటరీని సెట్ చేశారు. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ కావడంతో 80 W సపోర్ట్ తో పనిచేయనుంది. రోజంతా వినియోగం చేసే వారికి.. జీకే కార్యకంగా ఉపయోగించేవారికి బ్యాటరీ సపోర్ట్ గా ఉండను. అలాగే డౌన్ టైం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ప్రీమియం ఫోన్లో ఉండే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. LPDDR5x RAM ఉండడంతో ఫోన్ మూవింగ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగించేవారు ఈ రామ్ ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. అలాగే ఇందులోUFS 4.1 స్టోరేజీ ఉండడంతో కావాల్సిన ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చు. యాప్స్ కూడా ఒకేసారి పనిచేసే విధంగా ప్రాసెసర్ పనిచేస్తుంది. అయితే ఇది మార్కెట్లోకి రావడానికి సమయం పట్టినప్పటికీ.. దీని గురించి ఇప్పుడే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.