Homeబిజినెస్Realme C85 Price India 2026: 7000 mAh బ్యాటరీ.. 13 MP కెమెరా.. ధర...

Realme C85 Price India 2026: 7000 mAh బ్యాటరీ.. 13 MP కెమెరా.. ధర మాత్రం చాలా చీప్.. ఈ ఫోన్ గురించి తెలిస్తే మిడిల్ క్లాస్ పీపుల్స్ అస్సలు విడిచిపెట్టరు..

Realme C85 Price India 2026: ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మొబైల్ లో బ్యాటరీ సామర్థ్యం గురించి పక్కాగా తెలుసుకుంటున్నారు. బ్యాటరీ మెరుగ్గా ఉంటేనే రోజువారి వినియోగదారులకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా బ్యాటరీ చార్జింగ్ గంటలపాటు ఉండాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి ఈ కొత్త మొబైల్ 7000 mAh తో అందిస్తుంది. అలాగే సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. వీరికి ఈ మొబైల్లో ఉండే 13 MP కెమెరా అద్భుతంగా పనిచేయునుంది. ఈ రెండు ఉన్న ఈ కొత్త మొబైల్ లో ఇటీవల భారత దేశంలో ప్రారంభించారు. ఇంతకీ ఇది ఏ మొబైల్? దీని ధర ఎందుకంత తక్కువ?

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

Realme మొబైల్స్ కు భారత దేశంలో అత్యంత ఆదరణ లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మిడ్ రేంజ్ పీపుల్స్ ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా కొంటూ ఉంటారు. ఎందుకంటే వీటి ద్వారా బడ్జెట్ లోపే ఉంటుంది. అయితే 2026 మార్చి 6న మార్కెట్లోకి వచ్చిన Realme కంపెనీకి చెందిన C85 మొబైల్ తక్కువ ధర తో ఉండడమే కాకుండా నేటి వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్లు ఇందులో కనిపిస్తాయి. ఈ ఈ మొబైల్ లో 6.8 అంగుళాల HD డిస్ప్లే కనిపిస్తోంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.900 nits బ్రైట్నెస్ పనిచేసే ఈ మొబైల్ లో 4 GB రామ్ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 64 జీబీ స్టోరేజ్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు రకాల వేరియంట్ తో రూ.13,499 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే 6 GB రామ్, 128 GB స్టోరేజ్ ఉన్న మొబైల్ రూ.17,499 తో పొందవచ్చు.

అయితే ఇంత తక్కువ ధర ఉన్న ఈ మొబైల్ లో బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉంది. ఇందులో 7,000 mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 15 W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ లో 13 ఎంపీ మెయిన్ కెమెరా కనిపిస్తుంది. ఇది సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఫుల్ సపోర్ట్ తో ఉంటుంది. ఫ్రంటు కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం 5 MP ఉండనుంది. ఇవే కాకుండా ఇందులో 5G కనెక్టివిటీ, టైప్ సి పోర్టు, జిపిఎస్ వంటి ఫీచర్లు నేటి తరం వారికి అనుగుణంగా ఉంటాయి. మార్చి 7 నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే ఈ మొబైల్ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. దీనిని ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular