Credit Card Rent Payments: ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన తర్వాత చాలామంది ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేసుకున్నారు. ఒకరికి డబ్బులు పంపించడం.. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం.. వంటివి ఈ యాప్స్ నుంచే చేస్తున్నారు. కొందరైతే బ్యాంకులకు వెళ్లడం పూర్తిగా మానేశారు. చిన్న మొత్తాలే కాకుండా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ ను యూపీఐ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉండడంతో చాలామంది వీటిని ఫాలో అవుతున్నారు. అయితే బ్యాంకులతో ఈ సంస్థలు నేరుగా సంబంధం లేకుండా మనీ ట్రాన్స్ఫర్ ను చేయడం కరెక్టు కాదని భావించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15న ఆదేశాలు జారీ చేసింది. ఇకనుంచి ఈ యాప్స్ ద్వారా రెంటల్ పేరిట అమౌంటును ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలులేదని పేర్కొంది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడాన్ని నిలిపివేశాయి.
క్రెడిట్ కార్డ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా మందికి సులభతరం అయిపోయింది. గతంలో కొందరు ఇతరుల వద్ద అప్పులు తీసుకునేవారు సైతం ఇలా క్రెడిట్ కార్డు ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ తమ అవసరాలను తీసుకుంటున్నారు. కొందరు స్వైప్ మిషన్ ఉన్నవారు పర్సంటేజీలను తీసుకుంటూ ఇతరులకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులు ఇచ్చిన సంస్థలతో ఫోన్ పే, గూగుల్ పేలాంటి సంస్థలు నేరుగా సంబంధం లేకుండానే ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయని ఆర్.బి.ఐ తెలుపుతోంది. ఇలా ఏమాత్రం కేవైసీ పూర్తి చేయకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బ్యాంకులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బిఐ పేర్కొంది. అయితే కేవైసీ పూర్తి చేసిన వారు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.
ఇటీవల చాలా బ్యాంకులు తమ ఖాతాదారులను కేవైసీ పూర్తి చేయాలని కోరుతోంది. కానీ చాలామంది కేవైసీ ని పూర్తి చేయడం లేదు. ఇలా చేయకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి వారికి ఫోన్ పే, గూగుల్ పే అవకాశం ఇస్తే చర్యలు ఉంటాయని కూడా పేర్కొంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యాప్స్ రెంటల్ పేమెంటును నిలిపివేశాయి. అయితే చిన్న చిన్న అవసరాల కోసం రెంటల్ తీసుకునే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా కొందరు పర్సంటేజీల మీద రెంటల్ ద్వారా ఆదాయాన్ని పొందేవారు. ఇలాంటి వారికి కూడా నష్టం చేకూరే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ రెంటల్ వచ్చిన కొత్తలో ఈ సంస్థలు ఉచితంగానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవి. ఆ తర్వాత ఆర్బిఐ నిబంధనలు పెట్టడంతో ఒక శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు పూర్తిగా సేవలను నిలిపివేయాలని తెలపడంతో రెంటల్ చేసుకుని అవకాశం లేకుండా పోయింది.