Homeబిజినెస్RBI credit card rules 2026: క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్..

RBI credit card rules 2026: క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్..

RBI credit card rules 2026: ఈరోజుల్లో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య ఎక్కువే అని చెప్పవచ్చు. ఆర్థిక అవసరాలతో పాటు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే క్రెడిట్ కార్డుపై వచ్చే బిల్లు చెల్లించే విషయంలో చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ఒకటి డ్యూ డేట్‌లో ఒక్క రోజు ఆలస్యమైనా అదనపు లేట్ పేమెంట్ ఛార్జీలు విధించడం. ఇప్పటి వరకు డ్యూ డేట్ అర్ధరాత్రి 12.59 గంటలకు ముందు చెల్లింపు జరిగితే మాత్రమే సేఫ్‌గా పరిగణించబడేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం, డ్యూ డేట్ తర్వాత మూడు క్యాలెండర్ డేస్ (అంటే 72 గంటలు) వరకు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. ఈ పీరియడ్‌లో చెల్లింపు చేస్తే ‘పాస్ట్ డ్యూ’ స్టేటస్ రాదు, లేట్ ఫీజు కూడా ఉండదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొన్ని కారణాల వల్ల క్రెడిట్ కార్డు బిల్లులు సరైన సమయానికి చెల్లించకపోవచ్చు. దీంతో ఈ బిల్లులపై అదనంగా, లేట్ పేమెంట్ ఫీజు విధిస్తారు. అయితే ఇప్పటి వరకు మొత్తం మీద ఛార్జీలు విధించేవారు. కానీ ఇక నుంచి డ్యూ డేట్ తర్వాత ఔట్‌స్టాండింగ్ అమౌంట్ మీద మాత్రమే ఛార్జీలు విధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరణలు చేసింది. ఉదాహరణకు బిల్లు రూ. 10,000 అయితే ఇందులో ఇప్పటికే రూ. 2,000 చెల్లించి ఉంటే, లేట్ ఫీజు రూ. 8,000 మీద మాత్రమే వసూలు చేయాలి. ఇది యూజర్ల మీద అనవసర భారాన్ని తగ్గిస్తుంది.

ఈ మార్పులు క్రెడిట్ కార్డు ఇష్యూయర్లు, బ్యాంకులు, NBFCలు, పేమెంట్ నెట్‌వర్కులు, ట్రావెల్ కంపెనీలు, వాలెట్ యాప్‌లు వంటి అన్ని సంస్థలకు వర్తిస్తాయి. RBI ఇప్పటికే ఈ సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇది కస్టమర్ రైట్స్‌ను బలోపేతం చేస్తూ, ట్రాన్స్‌పరెన్సీని పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా RBI క్రెడిట్ కార్డు ఛార్జీలపై కట్టుబాటు నిబంధనలు విధించిన సందర్భం ఉంది.

క్రెడిట్ కార్డు యూజర్లు ఇకపై డ్యూ డేట్‌ను గుర్తుంచుకోవడానికి టెన్షన్ పడకూడదు. మూడు రోజుల గ్రేస్ పీరియడ్‌తో సహజంగా జీవితం సులభమవుతుంది. అయితే, ఈ ప్రయోజనాలు పూర్తిగా 2027 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. యూజర్లు తమ బ్యాంకు యాప్‌లు, వెబ్‌సైట్‌లలో ఈ మార్పుల గురించి అప్‌డేట్స్ చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version