RBI credit card rules 2026: ఈరోజుల్లో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య ఎక్కువే అని చెప్పవచ్చు. ఆర్థిక అవసరాలతో పాటు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే క్రెడిట్ కార్డుపై వచ్చే బిల్లు చెల్లించే విషయంలో చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ఒకటి డ్యూ డేట్‌లో ఒక్క రోజు ఆలస్యమైనా అదనపు లేట్ పేమెంట్ ఛార్జీలు విధించడం. ఇప్పటి వరకు డ్యూ డేట్ అర్ధరాత్రి 12.59 గంటలకు ముందు చెల్లింపు జరిగితే మాత్రమే సేఫ్‌గా పరిగణించబడేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం, డ్యూ డేట్ తర్వాత మూడు క్యాలెండర్ డేస్ (అంటే 72 గంటలు) వరకు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. ఈ పీరియడ్‌లో చెల్లింపు చేస్తే ‘పాస్ట్ డ్యూ’ స్టేటస్ రాదు, లేట్ ఫీజు కూడా ఉండదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొన్ని కారణాల వల్ల క్రెడిట్ కార్డు బిల్లులు సరైన సమయానికి చెల్లించకపోవచ్చు. దీంతో ఈ బిల్లులపై అదనంగా, లేట్ పేమెంట్ ఫీజు విధిస్తారు. అయితే ఇప్పటి వరకు మొత్తం మీద ఛార్జీలు విధించేవారు. కానీ ఇక నుంచి డ్యూ డేట్ తర్వాత ఔట్‌స్టాండింగ్ అమౌంట్ మీద మాత్రమే ఛార్జీలు విధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరణలు చేసింది. ఉదాహరణకు బిల్లు రూ. 10,000 అయితే ఇందులో ఇప్పటికే రూ. 2,000 చెల్లించి ఉంటే, లేట్ ఫీజు రూ. 8,000 మీద మాత్రమే వసూలు చేయాలి. ఇది యూజర్ల మీద అనవసర భారాన్ని తగ్గిస్తుంది.
ఈ మార్పులు క్రెడిట్ కార్డు ఇష్యూయర్లు, బ్యాంకులు, NBFCలు, పేమెంట్ నెట్‌వర్కులు, ట్రావెల్ కంపెనీలు, వాలెట్ యాప్‌లు వంటి అన్ని సంస్థలకు వర్తిస్తాయి. RBI ఇప్పటికే ఈ సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇది కస్టమర్ రైట్స్‌ను బలోపేతం చేస్తూ, ట్రాన్స్‌పరెన్సీని పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా RBI క్రెడిట్ కార్డు ఛార్జీలపై కట్టుబాటు నిబంధనలు విధించిన సందర్భం ఉంది.
క్రెడిట్ కార్డు యూజర్లు ఇకపై డ్యూ డేట్‌ను గుర్తుంచుకోవడానికి టెన్షన్ పడకూడదు. మూడు రోజుల గ్రేస్ పీరియడ్‌తో సహజంగా జీవితం సులభమవుతుంది. అయితే, ఈ ప్రయోజనాలు పూర్తిగా 2027 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. యూజర్లు తమ బ్యాంకు యాప్‌లు, వెబ్‌సైట్‌లలో ఈ మార్పుల గురించి అప్‌డేట్స్ చూడాలి.