Pulsar : బజాజ్ ఆటో 50కి పైగా దేశాల్లో 2 కోట్లకు పైగా యూనిట్ల అమ్మకాల రికార్డును సాధించింది. ఈ సంతోషకరమైన సందర్భంలో కంపెనీ ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు కూడా కొత్త పల్సర్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇప్పుడు తక్కువ ధరకే కొత్త బజాజ్ బైక్‌ను కొనుగోలు చేయడానికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చుచ. ప్రస్తుతం కంపెనీ రూ.7,379 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ పరిమిత కాల ఆఫర్ పల్సర్ 125 నియాన్, పల్సర్ 150, 125 కార్బన్ ఫైబర్, N160 USD, 220F మోడళ్లపై అందుబాటులో ఉంది. ఏ మోడల్‌పై మీరు ఎంత ఆదా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం:
బజాజ్ బైక్‌లపై డిస్కౌంట్ వివరాలు:
* పల్సర్ 125 నియాన్: ఈ బైక్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.1,184 ఆదా చేసుకోవచ్చు. దీని ధర రూ.84,493 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
* బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్: ఈ మోడల్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.2,000 ఆదా చేయవచ్చు. దీని ధర రూ.91,610 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
* బజాజ్ పల్సర్ 150 (సింగిల్ డిస్క్, ట్విన్ డిస్క్): ఈ రెండు వేరియంట్‌లపై రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,12,838 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), ట్విన్ డిస్క్ మోడల్ ధర రూ.1,19,923 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
* బజాజ్ పల్సర్ N160 USD: ఈ మోడల్‌పై కంపెనీ రూ.5,811 డిస్కౌంట్ అందిస్తోంది. దీనిని కొనుగోలు చేయడానికి మీరు రూ.1,36,992 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఖర్చు చేయాల్సి ఉంటుంది.
* పల్సర్ 220F: ఈ వేరియంట్‌పై అత్యధికంగా రూ.7,379 డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో నివసించే వారికి మాత్రమే వర్తిస్తుంది.
భారతదేశంలో పల్సర్ ప్రస్థానం
బజాజ్ ఆటో మొట్టమొదటిసారిగా 2001లో పల్సర్ బైక్‌ను విడుదల చేసింది. కంపెనీ 1 కోటి అమ్మకాల మార్కును చేరుకోవడానికి 17 సంవత్సరాలు పట్టింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తర్వాతి 1 కోటి అమ్మకాలను కేవలం 6 సంవత్సరాల్లోనే పూర్తి చేసింది.