SEBI Chief: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆదానీ గ్రూప్ తో సంబంధాలు కలిగి ఉందని మొదట అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆమెపై ఆరోపణలు చేసింది, ఆ తర్వాత కాంగ్రెస్ టార్గెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు మరో వివాదంలో ఉంది. వాస్తవానికి, ఈ నెలలో పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా PAC (ప్యాక్) ఎదుట మాధబి బుచ్ హాజరుకానున్నారు. చీఫ్ మాధవి పూరీ బచ్ 24 అక్టోబర్, 2024న పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎదుట హాజరయ్యేు అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెబీ, ట్రాయ్ ఉన్నతాధికారులను పీఏసీ పిలిపించింది. రెగ్యులేటరీ బాడీ పని తీరును సమీక్షిస్తున్నామని, సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్‌తో పాటు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి కూడా ప్యానెల్ ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నాయిని వర్గాలు పేర్కొన్నట్లు నివేదిక వివరించింది. అదానీ గ్రూప్‌తో మాధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌కు సంబంధాలున్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపణల మేరకు ఈ కీలక పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం కావడం గమనార్హం. దీనిపై అదానీ తీవ్ర ఆరోపణలు చేశారు. హిండెన్‌బర్గ్ గతేడాది కూడా గౌతమ్ అదానీపై నిందలు వేసింది. ఆ సమయంలో భారత్ లో సుప్రీం కోర్టు కలుగజేసుకుంది. ఇవన్నీ ఆరోపణలేనని ఇందులో నిజాలు లేవని తేలింది. ఆ సమయంలో అదానీ గ్రూప్ భారీ నష్టాన్ని చవిచూసింది.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత, 2024 ఆగస్టులో కాంగ్రెస్ సెబీ చీఫ్, ఆమె భర్తపై చేసిన ఆరోపణలను లక్ష్యంగా చేసుకుంది. వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సెబీ చైర్ పర్సన్ కాంగ్రెస్, హిండెన్ బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ.. ఎటువంటి తప్పు చేయలేదని ఖండించారు. అదానీ గ్రూప్‌పై నివేదిక విడుదలై 18 నెలలు గడిచినా, సెబీ తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి ఆసక్తి చూపలేదని హిండెన్‌బర్గ్ తన నివేదికలో మరోసారి ఆరోపించింది.
జూన్ 5, 2015న సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్-1లో మాదాబి బుచ్, ధవల్ బుచ్ ఖాతా తెరిచినట్లు విజిల్ బ్లోయర్ పత్రాలు వెల్లడించాయని హిండెన్‌బర్గ్ చెప్పింది. ఈ జంట మొత్తం పెట్టుబడి 10 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. హిండెన్‌బర్గ్ ఆఫ్ షోర్ మారిషస్ ఫండ్‌ను అదానీ గ్రూప్ డైరెక్టర్ ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా ఏర్పాటు చేశారని, పన్నులకు స్వర్గధామమైన మారిషస్‌లో రిజిస్టర్ చేయబడిందని ఆరోపించారు.
అమెరికా షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన సెబీ చీఫ్, ఆరోపణల్లో నిజం లేదని సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త ప్రకటన విడుదల చేశారు. ‘ఏ రకమైన నిజం లేదు. మన జీవితం, ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం లాంటివి. సెబీ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య తీసుకొని షోకాజ్ నోటీస్ జారీ చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్, ఇప్పుడు అదే ప్రతిస్పందనగా మమ్ములను ఈ పదవి నుంచి తొలగించేందుకుప్రయత్నించడం దురదృష్టకరం’ అన్నారు. పారదర్శకతతో తగిన సమయంలో వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Public accounts committee summons sebi chief madhabi puri buch on oct 24 amid adani hindenburg row
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com