https://oktelugu.com/

Money: రూ.25,000 వేతనంతో రూ.కోటి ఆదా చేయవచ్చు.. ఎలా అంటే?

Money: మనలో చాలామంది తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం డబ్బును సంపాదించాలని భావిస్తుంటారు. అయితే కొంతమంది తమ వేతనం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మొత్తం ఆదా చేయడం సాధ్యం కాదు. అయితే తెలివిగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలని అనుకునే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ రూపంలో డబ్బులను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 8, 2022 / 09:17 PM IST
    Follow us on

    Money: మనలో చాలామంది తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం డబ్బును సంపాదించాలని భావిస్తుంటారు. అయితే కొంతమంది తమ వేతనం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మొత్తం ఆదా చేయడం సాధ్యం కాదు. అయితే తెలివిగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలని అనుకునే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

    ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ రూపంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో అదిరిపోయే లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నెలకు సిప్ రూపంలో 2600 రూపాయలు ఇన్వెస్ట్ చేసినా మెచ్యూరిటీ తర్వాత ఏకంగా 50 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాలు చేసేవాళ్లు ప్రతి నెలా పీఎఫ్ కోసం కొంత మొత్తం చెల్లిస్తారు.

    ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై 8 శాతానికి అటూఇటుగా వడ్డీ లభిస్తుంది. దాదాపు 25 సంవత్సరాల పాటు పీఎఫ్ చెల్లిస్తే రిటైర్మెంట్ సమయానికి ఏకంగా 50 లక్షల రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ విధంగా సులువుగా డబ్బులు పొందే అవకాశాలు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. తక్కువ వేతనం వచ్చేవాళ్లు డబ్బును పొదుపు చేయడానికి ఇదే ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు.

    పిల్ల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లు ఈ విధంగా పొదుపు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు సొంతమయ్యే ఛాన్స్ ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు పొందాలని భావిస్తే మాత్రం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.