కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో ప్రధాన మంత్రి ముద్ర యోజన స్కీమ్ కూడా ఒకటి. ప్రధాన మంత్రి ముద్ర యోజన రెండో దశను మొదలుపెట్టనున్నామని పీఎం మోదీ వెల్లడించారు. ఈ స్కీమ్ కింద బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తుండటం గమనార్హం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా ఈ రుణాలను పొందే అవకాశం ఉంటుంది.
స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముద్ర స్కీమ్ ద్వారా ప్రణాళికతో స్వయం ఉపాధి వైపు వేగంగా కదలమని ట్వీట్ చేసింది. వ్యవసాయేతర పరిశ్రమలకు తయారీ, వర్తకం, సేవా కార్యకలాపాల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏకంగా 10 లక్షల రూపాయల వరకు రుణాన్ని అందిస్తుండటం గమనార్హం.
పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రికల్నిక్స్ మరియు అగ్రిబిజినెస్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు చేసేవాళ్లు పీఎం ముద్ర యోజన స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. ముద్రా రుణాలలో శిశు, కిషోర్, తరుణ్ రుణాలు ఉంటాయి. శిశు కొరకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు 50,000 రూపాయలు, కిషోర్ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే రూ. 50,000 నుండి రూ. 5 లక్షల పైన పొందే అవకాశం ఉంటుంది.
తరుణ్ కింద రుణాలను తీసుకుంటే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల పైన రుణాలను పొందే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాలను బట్టి ఈ స్కీమ్ కు సంబంధించిన వడ్డీరేట్లలో మార్పులు ఉంటాయి.