Prerna Jhunjhunwala: ప్రస్తుత కాలంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ సాధించడం అనేది సామాన్య విషయం కాదు. కానీ స్టార్టప్ ప్రపంచంలో మాత్రం టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్కూల్ టీచర్ స్థాయి నుంచి వ్యాపార వేత్తగా ఎదిగిన ఓ మహిళ కొన్ని కోట్ల మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమె ఏం సక్సెస్ సాధించారు? అనేది మనం కూడా తెలుసుకుందాం.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహిళ పేరు ప్రేరణ జున్ జున్ వాలా. అసలు ఆమె స్కూల్ టీచర్ నుంచి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారో చూద్దాం.. జున్ జున్ వాలా భారతీయ సీరియల్ వ్యవస్థాపకురాలు. సింగపూర్ లో ప్రీస్కూల్ లిటిల్ పాడింగ్ టన్ ను స్థాపించిన ఆమె దాని తరువాత క్రియేటివ్ గెలీలియోను ప్రారంభించారు. ఇది సుమారు మూడు నుంచి పది సంవత్సరాల వయసు గల చిన్నారులకు విద్యను అందిస్తుంది. ఈ యాప్ పిల్లల్లో పఠన అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటును అందించడమే లక్ష్యంగా పని చేస్తోందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
స్కూల్ టీచర్ గా పని చేస్తున్న ప్రేరణ జున్ జున్ వాలాకు న్యూయార్క్ విశ్వవిద్యాలయం సైన్స్ లో డిగ్రీ పట్టాను అందించింది. కాగా లిటిల్ సింఘమ్ మరియు టూండమీ అనేవి ప్రేరణ జున్ జున్ వాలా కంపెనీ నిర్వహిస్తున్న రెండు సరికొత్త యాప్ లు. ఈ రెండు యాప్ లు యావత్ ప్రపంచ వ్యాప్తంగా బిలియన్లకు పైగా డౌన్ లోడ్ లు జరిగాయి.
భారత దేశంలోని ప్లే స్టోర్ లోని టాప్ 20 యాప్ ల కంటే చిన్నారుల లెర్నింగ్ యాప్ అగ్రస్థానంలో నిలిచిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆ యాప్ పిల్లలకు ఎంతగా ఉపయోగపడుతుందనే విషయాన్ని. ఈ క్రమంలోనే తాము రూపొందించిన సాఫ్ట్ వేర్ పిల్లలకు గేమిఫికేషన్, వీడియోలు, అనుకూలీకరించిన అభ్యాస అనుభవాన్ని అందిస్తాయని ప్రేరణ జున్ జున్ వాలా తెలిపారు.
ప్రేరణ జున్ జున్ వాలా ఏం స్టార్టప్ యాజమానుల తరహాలో ప్రీమియం కాలేజీలైన ఐఐటీ, ఐఐఎం వంటి బిజినెస్ స్కూళ్లలో చదవలేదు. అంతేకాదు ఆమె ఈ వెంచర్లను ప్రారంభించడానికి ముందు ఎలాంటి అధికారిక వ్యాపార శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ పిల్లల లెర్నింగ్ కు ఎంతగానో ఉపయోగపడే ఈ యాప్ లను రూపొందించి ఆమె సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా నిలిచారు.
గత సంవత్సరం ప్రేరణ జున్ జున్ వాలా కంపెనీలో సుమారు రూ.60 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె స్టార్టప్ విలువ 2023 సంవత్సరంలో $40 మిలియన్లుగా ఉందని తెలుస్తోంది. మన భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.330 కోట్లను చెప్పుకోవచ్చు. కాగా రానున్న రోజుల్లో ఈ సేవలను ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించాలని యోచనలో ఉన్నట్లు ప్రేరణ జున్ జున్ వాలా తెలిపారు. వ్యావహారిక భాషల్లో కూడా కంటెంట్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ విధంగా చేయడం వలన అనేక ప్రాంతీయ భాషల్లో విద్యార్థులను ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె వెల్లడించారు.