Car Prices: కారు కొనాలని ఒకప్పడు కలలు కనేవారు. కానీ ఇప్పుడు ఆలోచన వచ్చిన వెంటనే ఇంటికి కారు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్ల కంపెనీలు సైతం డిమాండ్ ను భట్టి ఉత్పత్తిని పెంచుతున్నాయి. అయితే సేల్స్ ను పెంచుకోవడానికి వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే గత నెలలోనే కొన్ని కార్ల కంపెనీలు బంఫర్ ఆఫర్లు ప్రకటించాయి. భారీ డిస్కౌంట్లు ఇచ్చి సేల్స్ ను పెంచుకున్నాయి. ఇదే సమయంలో జనవరిలో కార్ల ధరలు పెంచుతున్నామని ప్రకటించాయి. అయితే ప్రస్తుతం ఆ ధరలు ఎంత మేరకు పెంచుతున్నాయో ఇటీవల ప్రకటించాయి. ఆ వివరాల్లోకి వెళితే..
దేశీయంగా దిగ్గజ కంపెనీలుగా పేరున్న మారుతి సుజుకీ, మహీంద్రా, హ్యుందాయ్ కార్లు తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిమాణాలతో ముడి సరుకుల ధరలు పెరిగాయాని దీంతో ధరలు పెంచుతున్నట్లు కంపెనీలు తెలుపుతున్నాయి. 2023 ఏప్రిల్ నెలలోనే కార్ల ధరలు 0.8 శాతం పెరిగాయి. అయితే జనవరిలో మరోసారి పెరుగుదల ఉండడంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
అయితే కార్ల ధరలు ఏ మేరకు పెంచుతున్నారో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికి కొన్ని వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. మొత్తంగా కార్ల ధరలు 2 శాతం పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీఎం డబ్ల్యూ, ఫోక్స్ వ్యాగన్, మెర్సిడెజ్ బెంజ్, వోల్వో, నిస్సాన్, హోండా కార్లు ఈనెలలోనే 2 నుంచి 3 శాతం ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన ఎస్ యూవీలపై రేట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది.
గత నెలలో భారీ డిస్కౌంట్లతో విపరీతంగా విక్రయాలు జరుపుకున్న కార్ల కంపెనీలు పెంచిన ధరలతో ఎలాంటి విక్రయాలు ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2023 ఏప్రిల్ లో కార్ల ధరలు పెంచిన తరువాత విక్రయాలు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా మారుతి లాంటి కొన్ని కంపెనీలు వాటి సేల్స్ ను మరింతగా పెంచుకున్నారు. ఇప్పుడు కూడా పెరిగిన రేట్ల ప్రభావం అమ్మకాలపై ఏమాత్రం ఉండదని కొందరు నిపుణులు చెబుతున్నారు.