Redmi: చైనా కంపెనీ షావోమి మిడ్ రేంజ్ పీపుల్స్ కోసం కొత్తగా మొబైల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే Redmi Note మొబైల్ మార్కెట్ లోకి వచ్చి అందరినీ అలరించింది. అయితే ఇప్పుడు కొత్తగా Redmi Note 15 Pro, Redmi Note 15 Pro+అనే మొబైల్స్ స్మార్ట్ ఫీచర్లతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇవి నాణ్యమైన కెమెరాతో పాటు బలమైన బ్యాటరీ తో కలిగి ఉన్నాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు రోజువారి వినియోగదారులకు అనుగుణంగా దీనిని తయారు చేశారు. అంతేకాకుండా మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు కొనేలా అందుబాటులో ధరలు ఉంచారు. ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళితే..
Redmi Note 15 Pro, Redmi Note 15 Pro+ రెండు మొబైల్స్ ఇంచుమించు ఓకే ఫీచర్లను కలిగి ఉంటాయి. అయితే Redmi Note 15 Pro మొబైల్ విషయానికి వస్తే.. 6.83 అంగుళాల 1.5 k AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 3200 nits బ్రైట్నెస్ నువ్వు కలిగి ఉంటుంది.120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఈ మొబైల్ లో డాల్బీ , HDR 10+ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో 12 జిబి రామ్, 512 GB స్టోరేజ్ ను కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే 200 MP మెయిన్ కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ కెమెరాను అమర్చారు. అలాగే 20 MP సెల్ఫీ కెమెరా కోసం ఉపయోగించనున్నారు. ఇందులో 6,500 mAh బలమైన బ్యాటరీని చేర్చగా..45 W ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేయనుంది. ఈ మొబైల్ 8జిబి రామ్ , 256 GB స్టోరేజ్ తో ఉంటే.38,000 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
అలాగే Redmi Note 15 Pro+ మొబైల్ విషయానికి వస్తే ఇందులో 200 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇందులో 8MP అల్ట్రా వైడ్ కెమెరా పనిచేయనుంది 20 MP సెల్ఫీ కెమెరాను ఉపయోగించారు.6,500 mAh బ్యాటరీ ఉండగా..22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది. ఈ రెండు మొబైల్స్ ఇంచుమించు ఓకే ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ ధరలో కాస్త తేడా ఉంటుంది. అలాగే మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఇందులో ఫీచర్లో ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా గ్లేషియర్ బ్లూ, మోచా బ్రౌన్, మిష్టు పర్పుల్ వంటి ఆకట్టుకునే కలర్లు ఉండడంతో స్టైలిష్ కోరుకునే వారికి ఈ మొబైల్స్ అనుగుణంగా ఉండనున్నాయి. అంతేకాకుండా నేటి తరం వారికి.. మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి అనుగుణంగా ఫీచర్లు ఉండడంతో వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
