కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేర్వేరు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కంటే పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో లాభం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఖచ్చితమైన లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రోజుకు కేవలం 95 రూపాయలు పొదుపు చేయడం ద్వారా 20 సంవత్సరాలలో 14 లక్షల రూపాయలు పొందవచ్చు.
15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో మనీ బ్యాక్ ఆప్షన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 14 లక్షల రూపాయలు పొందాలని అనుకుంటే 25 సంవత్సరాల వ్యక్తి 7 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కొరకు హామీగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా 2853 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాలి. ఇలా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు 20 సంవత్సరాల కాలంలో ఏకంగా 13.71 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మెచ్యూరిటీకి మందే పెట్టుబడిదారులు మృతి చెందితే హామీపూరిత మొత్తం, బోనస్ మొత్తం నామినీ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ ను సందర్శించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా మేలు జరుగుతుంది.