Grama Suraksha Scheme: ప్రస్తుత కాలంలో డబ్బును పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా ఎక్కువ లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో గ్రామ సురక్ష పథకం ఒకటి కాగా ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి ఏకంగా 35 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
15 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు గ్రామ సురక్ష పథకంలో చేరడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 19 సంవత్సరాల వయస్సులో చేరిన వాళ్లు 10 లక్షల రూపాయల పాలసీని కొనుగోలు చేసిన వాళ్లు 60 సంవత్సరాల వరకు నెలకు 1411 రూపాయల చొప్పున చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత ఏకంగా 35 లక్షల రూపాయలు వస్తాయి. వయస్సు, చెల్లింపు కాలాన్ని బట్టి ప్రీమియంలో మార్పులు ఉంటాయి.
ఈ స్కీమ్ లో మూడు నెలలు, ఆరు నెలలు చొప్పున ఇన్వెస్ట్ చేసే అవకాశంతో పాటు పాలసీదారులు అవసరమైతే పాలసీని సరెండర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఏదైనా కారణం వల్ల ఇన్వెస్టర్ మరణిస్తే నామినీ లేదా వారసుడు డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ల ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ అయితే లభిస్తాయి.
పోస్టల్ శాఖలో ప్రజలకు లాభం చేకూరే ఎన్నో స్కీమ్స్ అమలులో ఉండగా ఈ స్కీమ్స్ లో చేరడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ కస్టమర్లకు ఈ స్కీమ్స్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.