పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.95 పొదుపుతో రూ.14 లక్షలు!

సాధారణంగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు వేర్వేరు స్కీమ్స్ లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఉండటంతో ఎక్కువ మొత్తంలో లాభాలను పొందడం సాధ్యం కాదు. చిన్న మొత్తంలో పొదుపు చేసి అదిరిపోయే రాబడి పొందాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ ఒక ఆప్షన్ అందుబాటులో ఉంచింది. ప్రతి నెలా తక్కువ డబ్బుతోనే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్‌లో పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ […]

Written By: Kusuma Aggunna, Updated On : June 14, 2021 5:21 pm
Follow us on

సాధారణంగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు వేర్వేరు స్కీమ్స్ లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఉండటంతో ఎక్కువ మొత్తంలో లాభాలను పొందడం సాధ్యం కాదు. చిన్న మొత్తంలో పొదుపు చేసి అదిరిపోయే రాబడి పొందాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ ఒక ఆప్షన్ అందుబాటులో ఉంచింది. ప్రతి నెలా తక్కువ డబ్బుతోనే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది.

పోస్టాఫీస్‌లో పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉండగా ఇందులో గ్రామ్ సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి. కేవలం రోజుకు రూ.95 పొదుపుతో ఈ స్కీమ్ ద్వారా ఏకంగా రూ.14 లక్షలు పొందవచ్చు. ఇది ఎండోమెంట్ ప్లాన్ కాగా 15 లేదా 20 ఏళ్ల టర్మ్‌తో ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ మెచ్యూరిటీ కంటే మూడుసార్లు ముందుగా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

మెచ్యూరిటీ తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే ఆ వ్యక్తి డబ్బులు పొందవచ్చు. ఒకవేళ చనిపోతే కుటుంబ సభ్యులకు లేదా నామినీకి డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. 19 సంవత్సరాల నుంచి 45 ఏళ్లలోపు వయసు ఉన్న వారు పాలసీ తీసుకోవచ్చు. 25 ఏళ్ల వయసులో ఉన్న వారు 20 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే రూ.32,735 ప్రీమియం కట్టాలి. రోజుకు కేవలం 95 రూపాయలు ఆదా చేస్తే ఈ మొత్తం చెల్లించవచ్చు.

పాలసీ తీసుకున్న 8వ ఏడాది రూ.1.4 లక్షలు, 12వ ఏడాది రూ.1.4 లక్షలు, 16వ ఏడాది రూ.1.4 లక్షలు వస్తాయి. 20వ ఏడాది రూ.2.8 లక్షలు, బోనస్ కింద రూ.6.72 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొత్తం 14 లక్షల రూపాయలు పొందవచ్చు.