Post Office Schemes: మనలో చాలామంది సంపాదించే డబ్బులో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే అలా భావించే వాళ్లకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. 18 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు ఎవరైనా ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. మైనర్లు అయితే తల్లిదండ్రులు పోస్టాఫీస్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 5.8 శాతం వడ్డీరేటు అమలవుతోంది.
ఈ స్కీమ్ లో నెలకు 10,000 రూపాయల చొప్పున పదేళ్ల పాటు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.16 లక్షల రిటర్న్స్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీతో పాటు చక్రవడ్డీ కూడా లభిస్తుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ తో పాటు పోస్టాఫీస్ లో వేర్వేరు స్కీమ్స్ అమలులో ఉన్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా గ్యారంటీగా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.
పోస్టాఫీస్ లో స్కీమ్ ను బట్టి పొందే బెనిఫిట్స్ లో మార్పులు ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రయోజనం చేకూరేలా పోస్టాఫీస్ స్కీమ్స్ ఉంటాయి. ప్రతి నెలా ఈ స్కీమ్ లో కొంత మొత్తం డిపాజిట్ చేయడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందవచ్చు.