Post Office : ఎక్కువగా ప్రజలు మ్యూచువల్ ఫండ్స్ అలాగే పోస్ట్ ఆఫీస్ పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ కూడా సామాన్య ప్రజల కోసం ఇప్పటివరకు అనేక రకాల పథకాలను అమలు చేసింది. ఎటువంటి రిస్క్ లేకుండా మీ డబ్బు సేఫ్ గా ఉండాలంటే పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టడం ఉత్తమం. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకాలలో గ్రామ సురక్ష యోజన పథకం కూడా ఒకటి. పోస్ట్ ఆఫీస్ లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం ప్రోగ్రాం లో గ్రామ సురక్ష యోజన పథకం కూడా ఒక భాగం. పోస్ట్ ఆఫీస్ వారు 1995లో గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ పథకంలో గరిష్టంగా 60 ఏళ్ల టెన్యూర్ వరకు పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. మహిళలందరికీ ఈ పథకం చాలా ఆకర్షణీయమైన మరియు సురక్షితమైన పెట్టుబడి పెట్టే పథకంగా చెప్పవచ్చు.
Also Read : కేవలం 4 ఏళ్లలో రూ.1 కోటి ఇచ్చే LIC అద్భుతమైన ప్లాన్…
ఈ పథకంలో కనీసం గా వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీస్ వారు ఈ పథకానికి 7.5% వడ్డీ అందిస్తున్నారు. ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 ఏళ్ళు, 60 ఏళ్లు. అలాగే ఈ పథకంలో పదివేల నుంచి పది లక్షల వరకు కూడా మీరు పెట్టుబడి చేయవచ్చు. మీరు ప్రీమియం చెల్లించడానికి నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి ఇలా మీకు ఆప్షన్లు కూడా ఉంటాయి. ఒకవేళ ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే నెలకు మీరు రూ.1,515 పొదుపు చేయాలి.
అంటే ప్రతి రోజు కేవలం 50 రూపాయలు మాత్రమే. ఈ పథకంలో మీరు 30 నుంచి 35 లక్షల వరకు మెచ్యూరిటీ సమయంలో రాబడి పొందవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మీరు 19 ఏళ్ల వయసులో 10 లక్షల ప్రీమియం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 55 ఏళ్ళు వచ్చేవరకు ప్రతి నెల రూ.1,515 ప్రీమియంగా చెల్లించాలి. ఒకవేళ మీరు 58 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే నెలకు మీరు రూ.1,463 ప్రీమియం కట్టాలి. 30 రోజుల గడువులోపు ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ మీరు 55 ఏళ్ల ఆప్షన్ ని ఎంచుకుంటే మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.31.60 లక్షలు అందుతాయి.