POCO M8 5G Price: కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని మొబైల్స్ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్లో మొబైల్ కొనాలని అనుకునే వారికి తక్కువ ధరలో డివైస్లు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికీ బడ్జెట్లో మొబైల్ ను అందించే POCO కంపెనీ లేటెస్ట్ గా M8 5G మొబైల్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆన్లైన్లో ఉంచడం ద్వారా ఈ ఫోన్ పై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో ప్రత్యేకంగా కెమెరా ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ వివరాల్లోకి వెళ్తే..
POCCO కంపెనీకి చెందిన M8 5G అనే మొబైల్ జనవరి మధ్యలో మార్కెట్లోకి రాబోతుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రధానంగా ఇందులో కెమెరా గురించి చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది ఏఐ ఫీచర్స్ ని కూడా కలిగే ఉంటుంది. ఫోటోగ్రఫీ కోరుకునే వారితోపాటు 4k వీడియో తీయాలని అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. అంతేకాకుండా సెల్ఫీ కెమెరా కూడా అద్భుతమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది.
ఈ మొబైల్ ప్రధానంగా డిస్ప్లే ఆకట్టుకొని ఉంది. 6.8 అంగుళాల బిగ్ స్క్రీన్ ను అందిస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. అలాగే చీకటిలో కూడా ఆకట్టుకునేలా డిస్ప్లేను అందిస్తుంది. నేటి వినియోగదారులు ఎక్కువగా మొబైల్ లోనే మూవీస్ చూస్తున్నారు. అలాగే కొందరు ప్రత్యేకంగా గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారికి ఈ బిగ్ స్క్రీన్ అరువుగా ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ను అమర్చారు. ప్రస్తుతం చాలామంది తమ మొబైల్ లో కార్యాలయాలు, ఇతర అవసరాలకు అనేక యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మొబైల్ స్లో అవుతుంది. ఈ సమస్య ఉండకుండా రాసి సార్ బాగా పనిచేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ఫోన్ పైన curved స్థానిలను అమర్చారు. గొరిల్లా గ్లాస్ తో ఉన్న ఇది ఎం సిరీస్ లో ఇప్పటివరకు లేనివిధంగా ఆకట్టుకునే డిజైన్తో మార్కెట్లోకి రానుంది. డిజైన్ టు ప్లే క్యాప్షన్ అన్నట్లుగా కనిపిస్తుంది. యూత్ ఎక్కువగా వీడియోలతో పాటు గేమింగ్ కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా ఇందులో స్టోరేజ్ కూడా కావలసినంత ఇందులో సెట్ చేశారు. అయితే ఈ ఫోన్ ధర గురించి అధికారికగా ప్రకటించకపోయినప్పటికీ బడ్జెట్లోనే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ రేంజ్ పీపుల్స్ కు ఇది అనుగుణంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.