POCO M7 Plus 5G: 2026 రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని మొబైల్ పై కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది కొత్త మొబైల్స్ కొనుగోలు చేశారు. అయితే కంపెనీలు మరింత సేల్స్ పెంచుకునేందుకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని మొబైల్ పై తగ్గింపును ప్రకటించాయి. వీటిలో భాగంగా POCO కంపెనీకి చెందిన మొబైల్ తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం వచ్చింది. ఇది ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సంస్థలో అందుబాటులో ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లతో పాటు.. మెరుగైన బ్యాటరీ, నాణ్యమైన కెమెరాతో పని చేసే ఈ మొబైల్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో..? ఎంత తగ్గింపు ధరకు వస్తుందో..? ఇప్పుడు చూద్దాం..
POCO కంపెనీకి చెందిన M7 Plus మొబైల్ పై భారీ తగ్గింపును ప్రకటించారు. ఈ మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6.9 అంగుళాల ఫుల్ HD+డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 850 nits పిక్ బ్రైట్నెస్ తో పని చేస్తుంది.288 Hz రిఫ్రిజిరేట్ తో పనిచేసే మీ మొబైల్ పై స్మూత్ స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అలాగే దీనిపై ఎలాంటి డస్ట్ పడినా కూడా వెంటనే రిమూవ్ చేసుకునే విధంగా తయారు చేశారు. ఈ మొబైల్ లో లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు ఇందులో భాగంగా 6S జెన్ 3 ప్రాసెసర్ ను సెట్ చేశారు. ఇది 8gb రామ్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆదారిత హైపర్ OS తో పనిచేసే ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల వరకు అప్డేట్ అవుతూ ఉంటుంది.
ప్రతి మొబైల్ కు ప్రస్తుత కాలంలో కెమెరా పనితీరు తప్పనిసరిగా మారిపోయింది. ఇప్పటి తరానికి అనుగుణంగా ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. డ్యూయల్ కెమెరా లో ఉండే ఇందులో ఆల్ట్రా వైడ్ సెన్సార్ కూడా పనిచేస్తుంది. అలాగే 8 MP సెల్ఫీ కోసం, వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. రెండు కెమెరాలు నాణ్యమైన ఫోటోలను తీసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా 4k వీడియోలు తీసుకోవడానికి కూడా ఈ కెమెరాలు సపోర్ట్ చేయనున్నాయి. ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని అమర్చారు. ఇందులో 7000 mAh బ్యాటరీ చేర్చారు. ఈ బ్యాటరీ 18 W చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. 5జి కనెక్టివిటీ తో ఇంటర్నెట్ అవుతుంది. ఈ మొబైల్లో ఫ్లిప్కార్ట్ లో తక్కువ ధరకే అందిస్తున్నారు. 4 GB రామ్, 128 GB స్టోరేజ్ హోండా మొబైల్ ను రూ.12,999 తో విక్రయిస్తున్నారు. అలాగే కొన్ని బ్యాంకు కార్డులపై 10% డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది.
