https://oktelugu.com/

హోం లోన్ తీసుకునే వారికి బంపర్ ఆఫర్.. రూ.10,000 డిస్కౌంట్..!

దేశంలోని చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు నగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే సొంతింటి కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం కావడంతో చాలామంది లోన్ తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. పీఎన్‌బీ హౌసింగ్ హోం లోన్ తీసుకోవాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హోం లోన్ తీసుకునే వాళ్లకు పది వేల రూపాయల డిస్కౌంట్ ప్రయోజనాలను అందిస్తోంది. Also Read: పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. సులభంగా లోన్ పొందే ఛాన్స్..? వోచర్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2021 10:37 am
    Follow us on

    PNB Home Loan

    దేశంలోని చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు నగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే సొంతింటి కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం కావడంతో చాలామంది లోన్ తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. పీఎన్‌బీ హౌసింగ్ హోం లోన్ తీసుకోవాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హోం లోన్ తీసుకునే వాళ్లకు పది వేల రూపాయల డిస్కౌంట్ ప్రయోజనాలను అందిస్తోంది.

    Also Read: పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. సులభంగా లోన్ పొందే ఛాన్స్..?

    వోచర్ల రూపంలో ఈ డిస్కౌంట్ కూపన్లను పొందే అవకాశం ఉంటుంది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ గిఫ్ట్ వోచర్లతో పాటు హోం లోన్ తీసుకునే వాళ్లకు ఇతర ప్రయోజనాలను సైతం అందిస్తూ ఉండటం గమనార్హం. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వాళ్లు హోం లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హోం లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ప్రాపర్టీ డాక్యుమెంట్ జిరాక్స్, శాలరీ స్లిప్స్, ఎడ్యుకేషన్స్ సర్టిఫికెట్స్ జిరాక్స్ లు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను, ఆరు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్ ను ఇవ్వాల్సి ఉంటుంది.

    Also Read: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త సర్వీసులు..!

    హోం లోన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు ప్రాపర్టీ కాస్ట్ లో ఏకంగా 90 శాతం వరకు రుణంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఎటువంటి ప్రి పేమెంట్ ఛార్జీలు, ఫ్లోర్ క్లోజర్ ఛార్జీలు ఉండవు. రుణం తీసుకున్న రోజు నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు రుణాన్ని చెల్లించవచ్చు. అయితే ఆలస్యంగా చెల్లిస్తే ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    సమీపంలోని పీఎన్‌బీ హౌసింగ్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ లోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు రిలేషన్ షిప్ మేనేజర్ ద్వారా డోర్ స్టెప్ సర్వీసులు లభిస్తాయి.