https://oktelugu.com/

కరోనా వల్ల జాబ్ పోయిందా.. రూ.10 లక్షల రుణం..?

దేశంలో కరోనా వైరస్ విజృంభణ వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్లపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం కోల్పోయి వ్యాపారం చేయాలని భావించే వాళ్లు ముద్రా యోజన స్కీమ్ కింద సులభంగా రుణం తీసుకునే అవకాశాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కల్పిస్తోంది. మోదీ సర్కార్ వ్యాపారం చేయాలని భావించే వాళ్లకు ఏకంగా 10 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా […]

Written By: Kusuma Aggunna, Updated On : April 27, 2021 6:13 pm
Follow us on

దేశంలో కరోనా వైరస్ విజృంభణ వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్లపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం కోల్పోయి వ్యాపారం చేయాలని భావించే వాళ్లు ముద్రా యోజన స్కీమ్ కింద సులభంగా రుణం తీసుకునే అవకాశాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కల్పిస్తోంది.

మోదీ సర్కార్ వ్యాపారం చేయాలని భావించే వాళ్లకు ఏకంగా 10 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. ముద్రా స్కీమ్ కింద మూడు రకాల రుణాలు పొందే అవకాశం ఉండగా అర్హత, అవసరం ప్రాతిపదికన రుణాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మోదీ సర్కార్ శిశు లోన్ కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం కల్పిస్తుండగా కిశోర్ లోన్ కింద రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పొందే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం.

తరుణ్ లోన్ కింద లోన్ తీసుకునే వాళ్లు ఏకంగా 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. డబ్బు అవసరం ఆధారంగా రుణం తీసుకుంటే మంచిది. http://www.mudra.org.in/ వెబ్ సైట్ ద్వారా ముద్ర లోన్ కొరకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ప్రాతిపదికన ముద్ర స్కీమ్ ద్వారా పొందే రుణాలకు సంబంధించిన మొత్తంలో మార్పులు ఉంటాయని సమాచారం.

ఈ రుణాలను పొందడానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైతే రుణాన్ని తీసుకుంటారో వారు రుణం తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా ఐదు సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది.