PM Kisan: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో కేంద్రం వాళ్ల ఖాతాలలో ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేస్తుంది. పొలంతో పాటు ఇతర అర్హతలు కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. అయితే కొంతమంది రైతుల ఖాతాలలో మాత్రం పీఎం కిసాన్ యోజన స్కీమ్ నగదు జమ కాలేదని సమాచారం అందుతోంది.
పీఎం కిసామ్ సమ్మాన్ నిధి స్కీమ్ నగదు జమ కాని రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఖాతాలలో నగదు జమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెపప్వచ్చు. పీఎం కిసాన్ నగదు జమ కాని రైతులు సమీపంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. పీఎం కిసాన్ నగదు జమ కాకపోతే మొదట www.pmkisan.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
Also Read: టీఆర్ఎస్ నేతలకు ప్రజాప్రయోజనాలు పట్టవా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూటి ప్రశ్న
వెబ్ సైట్ లో హోమ్ పేజ్ లో ఇచ్చిన ఫార్మర్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వెబ్ సైట్ బానిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా నగదు జమ అయిందో లేదో సులువుగా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు బ్యాంక్ ఖాతాకు సంబంధించి సమస్యలు ఉంటే నగదు జమ అయ్యే అవకాశాలు ఉండవని గుర్తుంచుకోవాలి.
పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. పీఎం కిసాన్ ఖాతాదారులు అధికారులతో వివరాలను సరి చేయించుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: రోజాకు ఈసారైనా మంత్రి పదవి దక్కేనా? ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకుంటారా?