
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ను అమలు చేస్తుండగా నిన్న ఈ స్కీమ్ కు సంబంధించి ఎనిమిదో విడత నిధులు జమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలలో నగదు జమ చేయనుంది. అయితే అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొంతమంది రైతుల ఖాతాలలో నగదు జమ కాలేదు.
పీఎం కిసాన్ స్కీమ్ 8వ విడత జమ కాని వాళ్లు ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాని వారు ఫిర్యాదు చేసి డబ్బులు జమయ్యేలా చేసుకోవచ్చు. మీ ఏరియా అగ్రికల్చర్ ఆఫీసర్ ను సంప్రదించడం లేదా పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పేర్లలో తప్పులు ఉండటం వల్ల కొన్నిసార్లు నగదు జమ కాకపోవడం జరుగుతుంది. తప్పులను సరిదిద్దుకోవడం వల్ల నగదు సులభంగా ఖాతాలలో జమయ్యే అవకాశం ఉంటుంది. 011 – 24300606, 011 – 23381092 నంబర్లకు కాల్ చేసి నగదు జమ కాకపోవడానికి గల కారణాలను సులభంగా తెలుసుకోవచ్చు. pmkisan-ict@gov.in ఈమెయిల్ కు మెయిల్ చేయడం ద్వారా కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు.
పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలలో 6వేల రూపాయలు జమ చేస్తోంది. మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాలలో ఈ నగదు జమ కానుంది. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా స్కీమ్ కొరకు దరఖాస్తు చేయవచ్చు.