Pension Account:  ఈ అకౌంట్ తో ప్రతి నెలా రూ.28 వేలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

Pension Account: మనలో చాలామంది కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించాలని భావిస్తారు. అయితే అలాంటి వాళ్లకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు. సామాజిక ఆర్థిక భద్రత స్కీమ్‌ లలో ఈ స్కీమ్ కూడా ఒకటి కావడం గమనార్హం. భార్య, పిల్లలకు క్రమం తప్పకుండా ఆదాయం రావాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. భర్త తన భార్య పేరుపై నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ ను సులభంగా ఓపెన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 25, 2021 8:38 pm
Follow us on

Pension Account: మనలో చాలామంది కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించాలని భావిస్తారు. అయితే అలాంటి వాళ్లకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు. సామాజిక ఆర్థిక భద్రత స్కీమ్‌ లలో ఈ స్కీమ్ కూడా ఒకటి కావడం గమనార్హం. భార్య, పిల్లలకు క్రమం తప్పకుండా ఆదాయం రావాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. భర్త తన భార్య పేరుపై నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ ను సులభంగా ఓపెన్ చేయవచ్చు.

భర్త తన భార్య పేరుపై ఈ విధంగా అకౌంట్ ను ఓపెన్ చేస్తే ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా భాగస్వామి ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటంతో పాటు మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం లభిస్తుంది. నెలకు కనీసం 1,000 రూపాయల నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

చెల్లించే మొత్తంను బట్టి పెన్షన్, మెచ్యూరిటీ డబ్బులు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులలో భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి. అమౌంట్ లో 60 శాతం విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉండటంతో పాటు 40 శాతం యాన్యుటీ ప్లాన్ ద్వారా లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా చేతికి పెన్షన్ డబ్బులు లభిస్తాయి. 30 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో కోటీ 12 లక్షల రూపాయలు లభిస్తాయి.

యాన్యుటీ రేటును 6 శాతంగా పరిగణలోకి తీసుకుంటే లైఫ్ లాంగ్ పెన్షన్ ను పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 30 సంవత్సరాల పాటు నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే కోటీ 12 లక్షల రూపాయలు పొందే అవకాశంతో పాటు నెలకు 28,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది.