Paytm : పేటీఎం కష్టాలకు కారణమేంటి?

సంస్థ కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందున ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించరాదని తెలిపింది. ఈ యాప్ కార్యకలాపాలపై కొందరు ఆడిటర్లు నివేదిక ఇచ్చిన తరువాత

Written By: Srinivas, Updated On : February 4, 2024 11:33 am

paytm problems

Follow us on

Paytm : ప్రముఖ డిజిటల్ మాధ్యమం Paytm సంస్థ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఫిబ్రవరి 29 నుంచి ఈ యాప్ ద్వారా ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించడంతో సంస్థ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ వారంలో గురు, వారం, శుక్రవారాల్లో పేటీఎం షేర్లు సైతం 40 శాతం పడిపోయాయి. సంస్థ కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందున ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించరాదని తెలిపింది. ఈ యాప్ కార్యకలాపాలపై కొందరు ఆడిటర్లు నివేదిక ఇచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడంతో అసలు ఈ సంస్థ ఇలా మారడానికి కారణమేంటి? అనే చర్చ సాగుతోంది.

డిజిటల్ మనీ ట్రాన్స ఫర్ తో పాటు కొన్ని బిల్లుల చెల్లింపులకు పేటీఎం వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. దీనిని 2009లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించారు. ప్రారంభంలో ఈ సంస్థ అనేక ఇబ్బందులు ఎదుక్కొంది. అయితే అలీబాబా గ్రూప్ నుంచి నిధులను సేకరించి ముందుకు సాగారు. ఇదే సమయంలో 2016లో నోట్ల రద్దు కావడంతో అప్పుడు డిజిటల్ పేమేంట్స్ అవసరం బాగా ఏర్పడింది. దీంతో పేటీఎం ను చాలా మంది డౌన్లోడ్ చేసుకొని వాడారు.

అయితే గూగుల్ పే తో పాటు మరికొన్ని సంస్థలు పేటీఎం నిర్వహించే కార్యకలాపాలు సంస్థలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపణలు కూడా చేశాయి. ఇదిలా ఉండగా పేటీఎం సంస్థలో విజయ్ శర్మకు 51 శాతం వాటా ఉంది. మిగతాది వన్ కమ్యూనికేషన్ ఆధీనంలో ఉంది. అయితే పేటీఎం సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శర్మ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేవైసీ ఉల్లంఘనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పేటీఎం పేమేంట్స్ బ్యాంకుకు సంబంధించి లక్షల మంది కేవైసీ చేయలేదని గుర్తించారు. అలాగే ఒకే పాన్ కార్డు తో వేలాది ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు.

పేటీఎం పేమేంట్స్ బ్యాంకుకు 35 కోట్ల ఈ వాలెట్ఉ ఉండగా.. ఇందులో 31 కోట్లు ఈ కేవైసీ చేయలేదని తేలింది. మిగిలిన ఖాతాల్లోనూ జీ బ్యాలెన్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఖాతాల వల్ల బ్యాంకు వినియోగదారులు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ విషయాలపై బయటి ఆడిటర్లు ఆర్బీఐకి నివేదిక ఇచ్చిన తరువాత ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం బ్యాంకు ఎలాంటి డిపాజిట్లు స్వీకరించదు. అలాగే వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఎలాంటి ఫాస్ట్ ట్యాగ్, వాలెట్, క్రెడిట్ కార్డు లావాదేవీలు నిర్వహించకూడదని తెలిపింది.