Parking Fees : నేటి కాలంలో చాలా మంది షాపింగ్ మాల్ లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రకాల డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించడంతో అన్ని వర్గాల వారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లోకి వెళ్తున్నారు. సిటీల్లో ఉండే షాపింగ్ మాల్స్ వచ్చే కొనుగోలుదారుల వాహనాల కోసం యాజమాన్యం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంటుంది. కొన్ని షాపింగ్ మాల్స్ లో ఇలా వాహనాలు పార్కింగ్ చేస్తే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొందరు ఏం చేయలేక పార్కింగ్ ఫీజును చెల్లిస్తున్నారు. కానీ ఇలా షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుసా? ఒకవేళ వారు ఒత్తిడి చేసినా ఈ రకంగా కంప్లయింట్ ఇస్తే వినియోగదారులకు ప్రయోజనాలు కలుగుతాయి. మరి అదేంటో తెలుసా?
షాపింగ్ మాల్స్ లో అన్ని రకాల వస్తువులు లభ్యమవుతాయి. దీంతో ఒక్కసారి ఒక షాపింగ్ మాల్ కు వెళితే నిత్యావసర వస్తువులతో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఇక ఫ్యామిలీతో వెళితే మాత్రం ఒక రోజంతా అక్కడే ఉండాల్సి వస్తుంది. కొందరు షాపింగ్ మాల్ లోకి ఇలా వెళ్లి అలా వస్తారు. కానీ కొందరు మాత్రం గంటల కొద్దీ అక్కడే ఉంటారు. అయితే నిబందనలు పాటించే షాపింగ్ మాల్ యాజమాన్యం కొందరి దగ్గర ఫీజు వసూలు చేస్తారు. మరికొందరిని పట్టించుకోరు. ఎందుకంటే?
Greater Hyderabad Muncipal Coroporation (GHMC) ఇటీవల కొన్ని షాపింగ్ మాల్స్ కు ఫైన్లు వేస్తోంది. కొన్ని యాజమాన్యాలు అనవసరంగా షాపింగ్ మాల్ లో కొనుగోలుదారుల నుంచి వాహనాల పార్కింగ్ ఫీజులును వసూలు చేస్తూ వారి జేబు గుళ్ల చేస్తున్నారు. కారు లేదా బైక్ కు రూ.30 వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పార్కింగ్ ఫీజు వసూలులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి పాటిస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ అవి పాటించకపోతే మాత్రం పార్కింగ్ ఫీజు నుంచి తప్పించుకోలేరు.
ఒక షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు 30 నిమిషాల లోపు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకుండా తిరిగి వస్తే ఎలాంటి పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉండి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకపోతే మాత్రం ఫీజును చెల్లించాలి. అయితే కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసినట్లయితే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ యాజమాన్యాలు ఏదైనా ఇబ్బందులకు గురిచేస్తే 04021111111 అనే నెంబర్ కు కాల్ చేసిన షాపింగ్ మాల్ పై ఫిర్యాదు చేయొచ్చు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Parking fees do not pay even a single rupee for parking fees in shopping malls because
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com