1800s Levi’s jeans : అమెరికాలో జరిగిన వేలంలో 1800ల నాటి లెవీస్ జీన్స్ ఒక్క జత $76,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు ₹62 లక్షల రూపాయల కంటే ఎక్కువకు అమ్ముడు పోయింది. ఇదో రికార్డుగా చెప్పొచ్చు. కైల్ హౌపెర్ట్ అనే 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి, జిప్ స్టీవెన్‌సన్‌తో కలిసి జీన్స్ జతను కొనుగోలు చేశారు. జీన్స్ మొట్టమొదట అమెరికన్ వెస్ట్‌లో పాడుబడిన మైన్‌షాఫ్ట్‌లో కనుగొనబడింది. నడుము పట్టీపై సస్పెండర్ బటన్‌లు ఉన్నాయి. దీని ఆధారంగానే ఈ జీన్స్ 1800 నాటిదిగా గుర్తించారు.

1880ల నాటిదిగా భావిస్తున్నట్లుగా ఈ జీన్స్ జతను అమెరికా రాష్ట్రంలోని న్యూ మెక్సికోలో వేలం వేశారు. జీన్స్ బ్రాండ్ లెవీ స్ట్రాస్ & కోకు చెందినది. వేలం ‘గోల్డ్ రష్’ యుగానికి చెందినదని తేల్చారు.
జర్మన్ వలసదారు అయిన ‘లెవీ స్ట్రాస్’ బవేరియాలోని బుటెన్‌హీమ్ నుండి కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు మారినప్పుడు అమెరికాలో ‘లెవీ స్ట్రాస్ & కో’ అనే పేరుతో దుస్తుల కంపెనీని 1853లో స్థాపించాడు. వాళ్ల ఉత్పత్తియే ఈ పాత కాలపు జీన్స్. జీన్స్‌కి సంబంధించిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా 13,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.
జీన్స్ మొట్టమొదట అమెరికన్ వెస్ట్ లోని పాడుబడిన మైన్‌షాఫ్ట్‌లో కనుగొనబడింది. 1880ల నాటిదని తేల్చారు. అవి కొవ్వొత్తి మైనపు మచ్చలతో తయారు చేశారు. కొన్ని అప్పటి వివరాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ప్రస్తుత లెవీల మాదిరిగా కాకుండా, ఈ పాతకాలపు జీన్స్‌లో నడుము పట్టీపై సస్పెండర్ బటన్లు మరియు ఒక వెనుక జేబు ఉన్నాయి.
“వింటేజ్ బట్టల వ్యాపారి కైల్ హౌపెర్ట్, జిప్ స్టీవెన్‌సన్‌తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు. ఇద్దరూ జీన్స్ కోసం మొత్తం $87,400 డాలర్లు చెల్లించారు. ఇప్పుడు నా లెవీస్ జీన్‌ని నా గ్రాండ్ గ్రాండ్ గ్రాండ్ గ్రాండ్ చిల్డ్రన్స్‌కి అందిస్తాను” అని కొనుగోలుదారు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. “నేను ఇదే జీన్స్ ను దుకాణంలో $13కి కనుగొన్నాను” అని మరొక నెటిజన్ దీనిపై సెటైర్ వేశారు. ఇంత రేటు అవసరమా? అని కామెంట్ చేశారు. అయితే అప్పట్లో నాటి కంపెనీలు నాణ్యమైన జీన్స్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఇన్ని వందల ఏళ్లు అయినా కూడా అది చెక్కుచెదరకుండా కాలపరీక్షకు నిలిచి ఇప్పటికీ మన్నికగా ఉంది. ఇప్పటి జీన్స్ కు అంత నాణత్య లేదని పలువురు వ్యాపారులు కితాబిస్తున్నారు.