spot_img
Homeబిజినెస్Oracle Layoff: ఇన్నాళ్లు పని చేయించుకుని..30 వేల మందిని మెడ పట్టుకొని గెంటేసింది..

Oracle Layoff: ఇన్నాళ్లు పని చేయించుకుని..30 వేల మందిని మెడ పట్టుకొని గెంటేసింది..

Oracle Layoff: ఇన్ని రోజుల పాటు వారితో పని చేయించుకుంది. బెంచ్ మీదికి రావడానికి చాలా సమయం ఇచ్చింది. ప్రాజెక్టుల విషయంలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరించింది. పదిమంది చేసే పనిని ఐదుగురితో చేయించింది. ఉద్యోగం కావాలి కాబట్టి.. జీతం లేకుంటే బతికే పరిస్థితి లేదు కాబట్టి.. చాలామంది అంతటి ఒత్తిడిని ఎదుర్కొని కూడా పనిచేశారు. కానీ.. ఇప్పుడు ఏకంగా మెడ పట్టుకుని గెంటేసింది ఆ కంపెనీ. ఒకరి కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 30 వేల మందిని బయటికి పంపించేసింది. మనదేశంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది.

అమెరికాలో టెక్నాలజీ దిగ్గజమైన కంపెనీల జాబితాలో ఒరాకిల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాలు ఉన్నాయి. కరోనా సమయంలో ఈ కంపెనీ భారీగా లాభాలను ఆర్జించింది.. అయితే ఇప్పుడు ఈ కంపెనీ లే ఆఫ్ పేరుతో ఉద్యోగులను తొలగించింది.. పింక్ స్లిప్ లు మూకుమ్మడిగా ఇచ్చింది. మంగళవారం పొద్దున్నే తొలగించిన ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది. కేవలం ఈ 30 వేల మంది మాత్రమే కాదట.. భవిష్యత్తులో ఇంకా చాలా తొలగింపులు ఉంటాయని ఒరాకిల్ కంపెనీ పేర్కొంది.. వాస్తవానికి ఇటీవల త్రైమాసికల్లో భారీగా లాభాలను ఆర్జించినప్పటికీ ఒరాకిల్ కంపెనీ ఇలా చేయడం టెక్ ఉద్యోగులకు మింగుడు పడడం లేదు.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడుల కోసం ఈ కంపెనీ ఉద్యోగుల మెడ మీద కత్తిపెట్టినట్టు తెలుస్తోంది. అమెరికా, మెక్సికో, కెనడా, భారత్ లాంటి దేశాలలో పనిచేస్తున్న 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం మందిని తొలగిస్తున్నట్టు ఒరాకిల్ వెల్లడించింది. అమెరికా, కెనడా ప్రాంతాలలో తొలగించిన ఉద్యోగులలో భారతీయులు పెద్ద మొత్తంలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలగింపునకు గురైన ఉద్యోగులలో ఎక్కువమంది మేనేజింగ్ స్థాయిలో ఉన్న వారే కావడం విశేషం.

తొలగించిన ఉద్యోగులకు నెల వేతనంతో పాటు.. మరో మూడు నెలల జీతం కూడా ఇవ్వనుంది ఒరాకిల్. కంపెనీలో ఉన్న సర్వీస్ ఆధారంగా చేయడానికి 15 రోజులు జీతాన్ని అదనంగా ఇస్తుంది. మార్చి 31 వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను క్యాష్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. లేబర్ చట్టాల ఆధారంగా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తూ ఉంటుంది. కంపెనీ నిర్దేశించిన గడువు లోగా రాజీనామా చేసిన వారికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయని తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగుల కంపెనీ లాప్టాప్ లకు ఈ యాక్సెస్ కూడా నిలిపివేసింది ఒరాకిల్. ఉద్యోగులు ఉదయం లేవగానే తొలగింపు మెయిల్స్ రావడంతో చాలామంది ఆవేదన చెందారు. ఈ తొలగింపును ఒరాకిల్ చరిత్రలోనే అతిపెద్దదని భావిస్తున్నారు. మరో విడతలో కూడా కోతలు ఉంటాయని.. అప్పుడు తమ ఉద్యోగాలు ఉంటాయా? లేవా? అనే ఆందోళన మిగతా ఎంప్లాయిస్ లో ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version