India Alternative To LPG DME Technology: యుద్ధం ఆగడం లేదు. ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ ఎవరి పంతాలకు వారు పోతుండడంతో.. ప్రపంచం మొత్తం ఆ పరిణామాలను అనుభవిస్తోంది. ఇరాన్ నుంచి చమురు.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడింది. మెజారిటీ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రజలకు అందించే గ్యాస్, ఇంధనం విషయంలో పొదుపు పాటిస్తున్నాయి. కొన్ని దేశాలైతే ప్రజలను బయటికి రావద్దని.. వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి.
గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో మన దేశానికి చెందిన సి.ఎస్.ఐ.ఆర్ నేషనల్ కెమికల్ లాబరేటరీ శాస్త్రవేత్తలు కీలక ప్రయోగాలు చేశారు. పూణే కేంద్రంగా కొద్ది రోజులుగా ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు చివరికి విజయం సాధించారు. వంట తయారీకి ఉపయోగించే ఎల్పిజి కి ప్రత్యామ్నాయంగా డై మిథైల్ ఈతర్ (DME) ను తయారు చేయడానికి ఇండియన్ టెక్నాలజీని చేశారు. శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ ను వంట తయారీకి ఉపయోగించే డై మిథైల్ ఈథర్ గా మార్కెట్ టెక్నాలజీని బిట్స్ శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించారు..
పూణే కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సి ఎస్ ఐ ఆర్ నేషనల్ కెమికల్ లాబటరీ సైంటిస్టులు ఎల్పిజికి ప్రత్యామ్నాయంగా డీఎంఈ ని తయారు చేయడానికి కావలసిన మన దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీనివల్ల గ్యాస్ దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది పూర్తిగా మనదేశ విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు ఇంధనం విషయంలో స్వయం సమృద్ధి సాధించడానికి సహాయపడుతుంది. కేటలిస్ట్ ను ఉపయోగించి మిథనాల్ ను డై మిథైల్ ఈతర్ గా మార్చేస్తుంది. ఇక ఈ పరిశోధన బృందానికి ప్రముఖ శాస్త్రవేత్త మలై స్వామి రాజా నాయకత్వం వహించారు.
డై మిథైల్ ఈథర్ లో తక్కువ పరిమాణంలో మసి వెలువడుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్.. సల్ఫర్ ఆక్సైడ్ తక్కువ స్థాయిలో విడుదలవుతాయి. అందువల్ల దీనిని ప్యూర్ ఫ్యూయల్ అని చెబుతుంటారు. వేడి విషయంలో కూడా ఇది ఎల్పిజి స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది.. దీని వాడకానికి సంబంధించి ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
