Oppo Reno 16 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppo కొత్తగా మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ నుంచి తీసుకురాబోతుంది. ఈ కంపెనీ నుంచి 16 లాంచ్‌కు సర్వం సిద్ధం చేసింది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోనూ ఈ సిరీస్ త్వరలోనే అడుగుపెట్టబోతున్నట్లు కంపెనీ అధికారికంగా టీజర్లను విడుదల చేసింది. వీటి ప్రకారం ఈ సిరీస్ లో మొత్తం రెండు ఫోన్లు రాబోతున్నాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..
Oppo కంపెనీ జూన్ 25న అంతర్జాతీయంగా మూడు స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేయబోతుంది. ఆ తరువాత భారతదేశంలో జూలై 2న అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సిరీస్ కింద ఒప్పో రెనో 16 (Oppo Reno 16), ఒప్పో రెనో 16 ప్రో (Oppo Reno 16 Pro) బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ రానున్నట్లు సమాచారం.
ఒప్పో రెనో 16 సిరీస్ ఫోన్లు పర్ఫార్మెన్స్ లో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నాయి. బేస్ మోడల్ అయిన రెనో 16 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను అందించగా, ప్రీమియం మోడల్ అయిన రెనో 16 ప్రో వెర్షన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 చిప్‌సెట్‌ను అమర్చారు. అంతేకాకుండా ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త కలర్ ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌పై నడవనున్నాయి. బ్యాటరీ విభాగంలో ఈ ఫోన్లు సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాయి. స్టాండర్డ్ మోడల్‌లో 6,500mAh బ్యాటరీ ఉండగా.. ప్రో మోడల్‌లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇవి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేయనున్నాయి.
రెనో సిరీస్ అంటేనే కెమెరాలకు పెట్టింది పేరు. ఈసారి ఒప్పో రెనో 16 ప్రో మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించబోతున్నారు. దీనితో పాటు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండనుంది. 50MP టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి. ఇక స్టాండర్డ్ మోడల్‌లో వెనుక వైపు మూడు కూడా 50MP కాంబినేషన్ రానుంది. సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ 50MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వబోతున్నారు.
డిస్‌ప్లే విషయానికి వస్తే, స్టాండర్డ్ ప్రో మోడల్స్ రెండూ 6.32 అంగుళాల AMOLED డిస్ ప్లేతో ఉండనున్నాయి. ఇవి 1.5K రిజల్యూషన్ తో పనిచేయస్తాయి. వీటిలో స్టాండర్డ్ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయగా, ప్రో మోడల్ ఏకంగా 144Hz హై-రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్ ప్రియులను ఆకట్టుకోనుంది.
ఈ ఫోన్లలో ‘ఒప్పో బబుల్స్’ అనే ఈ చిన్న మాగ్నెటిక్ అమోలెడ్ డిస్‌ప్లే స్క్రీన్‌ను ఫోన్ వెనుక వైపు అంటించుకోవచ్చు. దీనివల్ల వెనుక ఉన్న పవర్‌ఫుల్ 200MP కెమెరాలను వాడుతూ, ఆ స్క్రీన్‌లో చూసుకుంటూ అద్భుతమైన రియర్-కెమెరా సెల్ఫీలు మరియు వీడియోలు తీసుకోవచ్చు. దీనికి తోడు ఈ ఫోన్లు మెటల్ ఫ్రేమ్ బాడీ , అత్యున్నతమైన IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో రాబోతున్నాయి.
