Oppo New Launch Mobile 2026: చైనా కంపెనీ OPPO ఫోన్లు అంటే కొందరికి చాలా ఇష్టం. ఇవి అద్భుతమైన కెమెరా పనితీరుతో పాటు బలమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటాయి. రోజువారి వినియోగదారులతో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఈ ఫోన్లు బాగా నచ్చుతాయి. వీరికి అనుగుణంగా కంపెనీ కొత్త కొత్త మోడల్స్ న మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే లేటెస్ట్ గా కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇలాంటి ఫోన్ మార్కెట్లోకి రావడంతో చాలామంది దానిని కొనుగోలు చేశారు. అయితే అప్గ్రేడ్ టెక్నాలజీ తో పాటు.. నేటి తరానికి అనుగుణంగా ఉండేందుకు దీనిని తయారు చేస్తున్నారు. మరి ఈ ఫోన్లో బ్యాటరీ, కెమెరా ఎలా ఉంటుందో చూద్దాం..
OPPO కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన K13 5G వలె ఉండనున్నట్లు అంచనాలు ఉన్నాయి. దీని గురించిన సమాచారం ఆన్లైన్లో ఉంచారు. కొత్తగా రాబోయే ఫోన్ లో కెమెరా హైలెట్గా నిలవనుంది. ఈ ఫోన్లో 420 MP కెమెరా ఉండనుంది. ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ కంటే ఇది అద్భుతమైన మెగాపిక్సలను అందిస్తుంది. అలాగే 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా ఇదే స్థాయిలో ఉండడంతో అందరికీ అనుకూలంగా దీనిని వాడుకునేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా కంటెంట్ యూస్ చేసే వారికి ఈ కెమెరా పనితీరు అద్భుతం అని చెప్పుకోవచ్చు.
అలాగే ఈ మొబైల్లో బ్యాటరీ గురించి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 7700 mAh బ్యాటరీ చేర్చనున్నారు. ఈ బ్యాటరీ 80 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పని చేయనుంది. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ కావాలని అనుకునేవారు ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో ఎక్కువగా మొబైల్ యూజ్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 6 gen1 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు వచ్చిన ఫోన్లో ఉన్నప్పటికీ దీనిని అప్డేట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్లో 8 జిబి రామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఇన్ని ఫీచర్లో ఉన్న ఈ మొబైల్ తక్కువ ధరలోనే అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఫీచర్లో ఉన్న మొబైల్ K13 5G రూ.20,000 తో విక్రయించారు. ఇప్పుడు అప్డేట్ చేసిన మొబైల్ కనుక ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. అయితే మొబైల్ పై ఎక్కువగా ఆధారపడే వారికి ఇది అనుగుణంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
