OPPO flagship mobile launch: Oppo మొబైల్స్ అనగానే చాలా మందికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. డిఫరెంట్ కెమెరా సెటప్ తో పాటు ఫ్లాగ్ ఫిష్ ఫీచర్ తో ఆకట్టుకునే ఈ కంపెనీకి చెందిన చాలా మోడల్స్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా దీని నుంచి Find X9S OPPO ఫ్లాగ్‌షిప్ Find X సిరీస్‌లోని కాంపాక్ట్ మోడల్ గా చెప్పబడుతోంది. ఇది 2026 ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన తరువాత దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఫోన్ 7.99mm మందంతో చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. ఇందులో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1,256×2,760 పిక్సెళ్లతో నాణ్యతగా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో , 3,600 nits పీక్ బ్రైట్‌నెస్ ఉంటూ 1.15mm సూపర్-థిన్ బెజెల్స్‌తో ఆకట్టుకుంటుంది. కాంపాక్ట్ సైజ్‌తో హ్యాండ్‌హెల్డ్ ఉపయోగానికి బాగా సరిపోతుంది.
ఈ మొబైల్ లో MediaTek Dimensity 9500 లేదా 9000 సిరీస్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 12GB RAM, 256GB లేదా 512GB UFS స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో పనిచేసేవారికి ఫుల్ సపోర్టును ఇస్తుంది. Android 16 ఆధారిత ColorOSతో అధునాతన AI ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ లవెండర్ స్కై, మిడ్‌నైట్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్ వంటి కలర్లలో అందుబాటులో ఉన్నాయి.
వివో మొబైల్స్ కెమెరాకు ప్రత్యేకం. అందుకు అనుగుణంగానే ఇందులో ట్రిపుల్ 50MP కెమెరాలు ఉన్నాయి. 4K రిజల్యూషన్ తో వీడియో, AI ఎన్‌హాన్స్‌మెంట్స్ ఫొటోగ్రఫీ వారికి సపోర్టుగా ఉంటుంది. బ్యాటరీ పెర్ఫామెన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ మొబైల్ లో 7,025mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ బ్యాటరీ 80W వైర్డ్, 13.5W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఫోన్‌లోని మెరుగైన బ్యాటరీ లైఫ్ హైలైట్. వియత్నామ్‌లో 12GB+256GB వేరియంట్ 24.99M (సుమారు ₹85,000) గా ఉంది. ఇండియాలో ఇంకా అధికారిక లాంచ్ లేదు. అయితే ఇక్కడ మార్కెట్లోకి వస్తే రూ. 50,990 నుంచి రూ.70,000 వరకు ఉండే అవకాశం ఉంది.