spot_img
Homeబిజినెస్OPPO F33 Launch: ఈరోజే విడుదల.. ధర బడ్జెట్లోనే.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

OPPO F33 Launch: ఈరోజే విడుదల.. ధర బడ్జెట్లోనే.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

OPPO F33 Launch: OPPO కంపెనీకి చెందిన మొబైల్స్ భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ మొబైల్స్ లో కెమెరా పనితీరుతో పాటు బ్యాటరీ వ్యవస్థ బలంగా ఉంటుంది. అలాగే ఈ కంపెనీ మొబైల్స్ లో మీడియా టెక్ డైమెన్సిటీ చిప్ సెట్ కనిపిస్తుంది. దీంతో రోజువారి వినియోగదారులతో పాటు యూత్ ఇలాంటి మొబైల్స్ ను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్ ఏప్రిల్ 15 బుధవారం మార్కెట్లోకి రాబోతుంది.. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 15 బుధవారం రోజున OPPO F33 అనే మొబైల్ మార్కెట్లో లాంచ్ కారు ఉంది. దీని గురించి ఇప్పటికే గూగుల్ ప్లే కన్సోల్ లిస్టులో చేర్చారు. ఈ మొబైల్ డిజైన్ డిఫరెంట్ గా ఉండి వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో ఉండే ఈ మొబైల్ దుమ్ము, ధూళి నుంచి రక్షణగా ఉంటుంది. ఇందులో 6.57 అంగుళాల నుంచి 6.67 అంగుళాల వరకు AMOLED డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఫుల్ హెచ్డి Resolution తో పనిచేసే ఇందులో 8 GB వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 256 జీబీ స్టోరేజ్ వరకు కన్వీనెంట్గా ఉండనుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ ను అమర్చారు.

ఒప్పో కొత్త ఫోన్లో మొబైల్ పనితీరు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 32 ఎంపీ వరకు ఫ్రంటు కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. AI ఎరేజర్ 2.0 వంటి ఆప్షన్లు ఇందులో ఉండటంతో నాణ్యమైన ఫోటోలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ కూడా బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉండేందుకు ఇందులో 7000 mAh బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ 80 వాట్ లేదా 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దాదాపు 5 సంవత్సరాల వరకు ఈ చార్జర్ పనిచేసే అవకాశం ఉందని కొందరు పేర్కొంటున్నారు.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓఎస్ తో ఉండే ఈ మొబైల్ ధర సుమారుగా రూ.23,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే టాప్ వేరియంట్ మొబైల్ ధర రూ.35,000 నుంచి కొనుగోలు చేయవచ్చు. దీనిని లాంచ్ చేసిన తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫారం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular