https://oktelugu.com/

Redmi Note 12 Pro : రూ.13వేలకే 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు..    

ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలెు చేస్తే రూ.2000 డిస్కౌంట్ వస్తుంది. టోటల్ పేమేంట్ కాకుండా ఈఎంఐ ద్వారా కూడా ఫోన్ ను కొనుక్కునే సౌకర్యాన్నీ కంపెనీ కల్పించింది. ఇలా చేయడం వల్ల ఇన్ స్టంట్ గా మరో రూ.2000 డిస్కౌంట్ పొందుతారు.  ఇలా దాదాపు ఐదు వేల రూపాయల డిస్కౌంట్ తో రూ.12,999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 2, 2023 / 03:52 PM IST
    Follow us on

    Redmi Note 12 Pro : ప్రపంచమంతా ఇప్పుడు 5Gతో నిండిపోయింది. మార్కెట్లోకి వచ్చే కొత్త మైబైల్స్ అన్నీ 5Gతోనే వస్తున్నాయి. అప్డేడ్ ఫీచర్స్ తో పాటు ఆకర్షణీయంగా మొబైల్స్ ఉండడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్తగా వచ్చే మొబైల్స్ దాదాపు రూ.15 వేలకు పైగానే విక్రయిస్తున్నారు. మరికొన్ని రూ.20 నుంచి రూ.50 వేల వరకు అమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు మార్కెట్ ధరకు రిలీజ్ చేసినా..భారీ డిస్కౌంట్ తో వినియోగదారులకు అందిస్తున్నాయి. వివిధ ఆఫర్లతో కేవలం రూ.12 వేలల్లోనే 5G ఫోన్ ను దక్కించుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ మొబైల్ గురించి తెలుసుకుందాం..

    మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఆసక్తి చూపే మొబైల్స్ లో రెడ్ మీ నోట్ ఒకటి. ఈ మొబైల్ ను ప్రముఖ ఫోన్ తయారీ షావోమీ భారీ డిస్కౌంట్ తో వినియోగదారులకు ఇవ్వాలని నిర్ణయించింది.5G సిరీస్ లో వచ్చే  రెడ్ బీ నోట్ 12 ఫ్రో, రెడ్ మీ నోట్ 12 ఫ్రో ప్లస్ రేట్లు అధికంగా ఉన్నా భారీ డిస్కౌంట్లతో అందిస్తోంది. డిస్కౌట్ ద్వారా ఈ మొబైల్ ను దక్కించుకోవాలంటే అమెజాన్, ఎంఐ.కామ్ నుంచి కొనుగోలు చేయాలి. అలాగే హెచ్ డీ ఎఫ్ సీ లేదా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉండాలి.

    ప్రస్తుతం ఈ మొబైల్ ధర రూ.17,999తో విక్రయిస్తున్నారు. అయితే కన్జ్యూమర్స్ ను ఆకట్టుకునేందుకు రూ.1000 తగ్గించింది. అలాగే దీనిని ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలెు చేస్తే రూ.2000 డిస్కౌంట్ వస్తుంది. టోటల్ పేమేంట్ కాకుండా ఈఎంఐ ద్వారా కూడా ఫోన్ ను కొనుక్కునే సౌకర్యాన్నీ కంపెనీ కల్పించింది. ఇలా చేయడం వల్ల ఇన్ స్టంట్ గా మరో రూ.2000 డిస్కౌంట్ పొందుతారు.  ఇలా దాదాపు ఐదు వేల రూపాయల డిస్కౌంట్ తో రూ.12,999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

    రెడ్ మీ నోట్ 12 ప్రో పీచర్స్ విషయానికొస్తే 128 స్టోరేజ్ 6 జీబీ ర్యామ్ ను కలిగి ఉంది. 6.67 ఇంచెస్ అమోలెడ్ డిస్ ప్లే 120 హెచ్ జెడ్ రిఫ్రెస్ రేట్, 5000 ఎంహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెనరేషన్ 1 ఎస్ ఓ ఎస్,48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెల్పీ సెన్సార్ తోకూడుకొని ఉంది. ఇక ఈ ఫోన్ ను సొంతం చేసుకోవడానికి మీరు కూడా సిద్ధం కండి..