OnePlus 13S 5G
OnePlus :స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తన స్పెషల్ డిజైన్, పవర్ ఫుల్ ఫీచర్లతో దూసుకుపోతుంది వన్ ప్లస్(OnePlus). త్వరలోనే మరో సంచలనానికి తెరతీయనుంది. OnePlus 13s పేరుతో రాబోతున్న ఈ ఫోన్ ఇప్పటికే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. కంపెనీ కూడా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీని తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేయడంతో దీని రాక ఖాయమని తెలుస్తోంది. గత వారం చైనా మార్కెట్‌లో OnePlus 13T పేరుతో విడుదలైన ఈ ఫోన్, బ్లాక్ వెల్వెట్, పింక్ శాటిన్ అనే రెండు రంగుల్లో రాబోతుంది. అంతేకాదు, ఈ ఫోన్‌లో ఉండే కొన్ని ప్రత్యేక ఫీచర్లను కూడా కంపెనీ కన్ఫాం చేసింది.
Also Read : మే 1 నుండి ఐఫోన్, శాంసంగ్‌లపై భారీ డిస్కౌంట్
ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, OnePlus ఫోన్లకు ప్రత్యేకమైన అలర్ట్ స్లైడర్‌కు బదులుగా ఈ ఫోన్‌లో కస్టమర్ కస్టమబుల్ బటన్ ఉండవచ్చు.స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం OnePlus ఈ అప్‌కమింగ్ ఫోన్‌లో పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అందించనుంది. OnePlus 13s 6.32 ఇంచుల స్క్రీన్‌తో రానుండడం వల్ల ఇది కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌ను తెరవగానే పైన “Notify Me” అనే ఆప్షన్ కనిపిస్తుంది.
గతంలో లాగానే, OnePlus ఈ ఫోన్ కూడా అధికారికంగా విడుదలైన తర్వాత కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్‌లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే కాకుండా, ఈ ఫోన్‌ను ఆఫ్లైన్ స్టోర్స్‌లో కూడా విక్రయించనున్నారు.
ఎప్పుడు లాంచ్ అవుతుంది?
OnePlus 13s భారతీయ మార్కెట్‌లో వినియోగదారుల కోసం ఎప్పుడు విడుదల అవుతుందనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే, దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
OnePlus 13T ఫీచర్లు (అంచనా)
120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా సెన్సార్ ఉండవచ్చు. పవర్ ఫుల్ 6260mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు శక్తినిస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను 16GB వరకు RAM, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
OnePlus 13s ధర
చైనాలో OnePlus 13T పేరుతో విడుదలైన ఈ ఫోన్ ప్రారంభ ధర 3399 చైనీస్ యువాన్ (సుమారు రూ.39,650), టాప్ మోడల్ ధర 3999 చైనీస్ యువాన్ (సుమారు రూ.46,649). ఒకవేళ ఈ ఫోన్ భారతదేశంలో కూడా ఇదే ధరల రేంజ్ లో విడుదలయితే, SAMSUNG Galaxy S24 FE 5G (ధర రూ.41,999), Xiaomi 14 CIVI (ధర రూ.44,999) వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీనిస్తుంది.
Also Read : ఆర్డర్ చేసిన 90నిమిషాల్లోనే మీ ఇంటికి బీఎస్ఎన్ఎల్ 5జి సిమ్.. ప్రాసెస్ ఇదే
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: Oneplus oneplus 13s with a great camera and a huge battery