Homeబిజినెస్Oneplus 15R: ఫ్లాగ్ ఫిష్ కిల్లర్ ఫీచర్ తో వచ్చిన ఈ ఫోన్ గురించి హాట్...

Oneplus 15R: ఫ్లాగ్ ఫిష్ కిల్లర్ ఫీచర్ తో వచ్చిన ఈ ఫోన్ గురించి హాట్ హాట్ గా చర్చ.. ఎందుకంటే?

Oneplus 15R: కొత్తగా మొబైల్ కొనేవారు చాలా రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొందరు కెమెరా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటే మరికొందరు బ్యాటరీ విషయం లో శ్రద్ధ చూపుతూ ఉంటారు. అయితే కొన్ని కంపెనీలు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా అన్ని ఫీచర్లను హైలెట్ చేస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీలో Oneplus ఒకటి. ఈ కంపెనీ నుంచి మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయంటే చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఇటీవల 15 R అనే మొబైల్ ను ఆవిష్కరించింది. ఇందులో ఉన్న ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే దీని ధర కూడా బడ్జెట్ లోనే ఉండడంతో దీని గురించి చర్చించుకుంటున్నారు అసలు ఈ మొబైల్ లో ఉండే ఫీచర్స్, కెమెరా, బ్యాటరీ ఏ విధంగా ఉందో చూద్దాం..

Oneplus కంపెనీ నుంచి గత నెలలో 15 R అనే మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఫ్లాగ్ ఫిష్ కిల్లర్ అనే ఫీచర్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 7 చిప్ సెట్ తో కలిసి పని చేస్తుంది. దీంతో మొబైల్ వేగం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. గేమింగ్ కోరుకునే వారితోపాటు ప్రొఫెషనల్ గా మొబైల్ యూస్ చేసే వారికి ఈ సాఫ్ట్వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ 6.83 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. నాణ్యమైన వీడియోలతో పాటు మూవీస్ చూసేవారికి ఈ డిస్ప్లే అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అలాగే దీని చుట్టూ ఉన్న ప్యానెల్ మొబైల్కు ప్రత్యేకంగా రక్షణను ఇస్తుంది. ఈ ప్యానెల్ ప్రీమియం లుక్ ను కలిగి ఉంటుంది. అలాగే ఎలాంటి మరకలు పడినా కూడా వెంటనే తొలగిపోయే విధంగా దీని గ్లాస్ పై గొరిల్లా గ్లాస్ ను అమర్చారు.

ఈ మొబైల్ కెమెరా విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉన్న కెమెరా సోనీ ఐమాక్స్ 906 వలె పర్ఫామెన్స్ ను ఇవ్వనుంది. అంతేకాకుండా 4k వీడియోలు రికార్డింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అల్ట్రా వైడ్ స్నాప్స్ కావాలని అనుకునే వారికి 8 MP కెమెరా పనిచేస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ పర్ఫామెన్స్ కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో 7400 mAh బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక ఉండే విధంగా సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 80 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేయడంతో రోజువారి వినియోగదారులతో పాటు.. ఎక్కువగా మొబైల్ యూస్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం రూ.47,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version