spot_img
Homeబిజినెస్OnePlus 13 discount 12000: ఈ ఫోన్ పై ఏకంగా రూ.12,000 తగ్గింపు.. ప్రీమియం ఫీచర్లు.....

OnePlus 13 discount 12000: ఈ ఫోన్ పై ఏకంగా రూ.12,000 తగ్గింపు.. ప్రీమియం ఫీచర్లు.. సూపర్ డిజైన్.. వెంటనే త్వరపడండి..

OnePlus 13 discount 12000: ప్రముఖ మొబైల్ కంపెనీ One Plus నెంబర్ వన్ స్థానంలో కొనసాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కెమెరాతో పాటు మిగతా ఫీచర్స్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే ధర కూడా అందుబాటులో ఉంటుందని చాలామంది చెబుతుంటారు. అయితే ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ కొన్ని మోడల్స్ ఆకట్టుకుంటాయి. వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే వీటిపై తాజాగా తగ్గింపును ప్రకటించింది. దీంతో ప్రీమియం ఫోన్లో కొనాలని ఎదురుచూసేవారికి ఈ వన్ ప్లస్ ఫోన్ ను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇంతకీ ఏ మొబైల్ పై ఎంత.. తగ్గించిందో ఇప్పుడు చూద్దాం..

Oneplus కంపెనీకి చెందిన 13 సిరీస్ మొబైల్ పై ప్లాట్ డిస్కౌంట్ను అందించారు. ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.9000 వరకు తగ్గింపును పొందవచ్చు. వన్ ప్లస్ 13 మార్కెట్లోకి వచ్చిన సమయంలో రూ.69,999 ధరణి ప్రకటించారు. అయితే దీనిపై ప్రస్తుతం రూ.9000 ప్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ఫ్లాగ్ ఫిష్ మొబైల్ కొనాలని చూసేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఉండనుంది. దీంతో రోజువారి వినియోగదారులతో పాటు కోరుకునే వారికి ఈ ప్రాసెస్ ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది.

ఈ మొబైల్ లో 6000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు రెండు రోజులపాటు డౌన్ టైం తగ్గకుండా పనిచేస్తుంది. ఈ మొబైల్ లో కెమెరా పనితీరు కూడా మెరుగ్గా ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే 50 ఎంపీ అల్ట్రా వైట్ సెన్సార్ తో పనిచేస్తుంది. వాతావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా నాణ్యమైన ఫోటోలను ఈ కెమెరా ద్వారా తీసుకోవచ్చు. దీంతోపాటు ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కు కూడా ఈ కెమెరాలు అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఐపి68, ఐపిసి 69 రేటింగ్ ఉండడంతో ఎలాంటి దుమ్ము, ధూళి పడినా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ మొబైల్ లో 6.82 అంగుళాల HD+డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీని పానల్ కూడా చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో యూత్ దీనిని కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంది. అలాగే లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. మొత్తంగా ఈ మొబైల్ ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version