spot_img
Homeబిజినెస్New smartphones launching April: రెడీగా ఉండండి.. ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే కొత్త ఫోన్లు...

New smartphones launching April: రెడీగా ఉండండి.. ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే కొత్త ఫోన్లు ఇవే.. ధరలు ఎలా ఉన్నాయంటే?

New smartphones launching April: ఫోన్ల వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి నెలలో కొన్ని కంపెనీలు కొత్త మొబైల్స్ ను రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా 2026 ఏడాదిలో ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో అనేక మొబైల్స్ ను రిలీజ్ చేశాయి. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో కూడా కొన్ని కంపెనీలు ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. వీటిలో కొన్ని ప్రీమియం ఫోన్లో ఉండడంతో పాటు మరికొన్ని మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా తక్కువ ధరలో ఉండనున్నాయి. మరి ఆ మొబైల్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే..

ప్రముఖ చైనా కంపెనీకి చెందిన వివో V 70 Fe మొబైల్ ను ఏప్రిల్ రెండవ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇది v70 సిరీస్లో మొదటి Fe మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. 200 మెగాపిక్ సెల్ తో కూడిన మెయిన్ కెమెరా ఉండగా.. 8 ఎంపీ ఆల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ ఉండగా ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ధర రూ.30,000 నుంచి విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంచి డిస్ప్లే మొబైల్ కావాలని కోరుకునేవారు దీనిని ఎంపిక చేసుకోవచ్చని అంటున్నారు.

Realme కంపెనీకి చెందిన 16 5G మొబైల్ ను కూడా ఇండియాలో ఏప్రిల్ రెండవ తేదీన లాంచ్ చేయనున్నారు. బెస్ట్ కెమెరా ఉండాలని కోరుకునే వారితో పాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ మొబైల్ ఫుల్ సపోర్ట్ గా ఉండనుంది. ఎందుకంటే ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండడంతో పాటు 2 MP మోనో క్రోమ్ లెన్స్ తోపాటు 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ లో మీడియాటిక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉండనుంది. ఇందులో 6.57 డిస్ప్లే ను చూడొచ్చు.

Redmi కంపెనీ నుంచి 15 SE సీరీస్ మొబైల్ మార్కెట్లోకి ఏప్రిల్ 2న రానుంది. ఈ మొబైల్ ను రూ.20,000 లోపే విక్రయించే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు వచ్చిన రెడ్మి 15 లో ఉండే ఫీచర్లు కనిపిస్తాయి. ఇందులో బలమైన బ్యాటరీ ఉండడంతో రోజువారి వినియోగదారులతోపాటు గేమింగ్ కోరుకునేవారు దీనిని ఎంచుకోవచ్చని అంటున్నారు.

వివో కంపెనీకి చెందిన X 300 అని మొబైల్ కూడా ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. మార్చి 30న దీనిని చైనాలో లాంచ్ చేశారు. అయితే భారత్ లో మాత్రం తేదీని ప్రకటించకపోయినా ఈ నెలలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఇదే కంపెనీకి చెందిన X 300 S అనే మొబైల్ కూడా మార్కెట్లోకి రానుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version