Gold Rate Dhanteras: ఈరోజు ప్రపంచ తొలి వైద్యుడు మహర్షి ధన్వంతరి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ధన్‌తేరస్‌ను జరుపుకుంటున్నారు. ధన్‌తేరస్ సందర్భంగా బంగారం, వెండి, లోహ పాత్రలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా ఈ రోజు చాలా మంది బంగారం, వెండి కొనుగోళ్ల పై ఆసక్తి చూపుతారు. ధన్‌తేరస్ సందర్భంగా బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ రోజు వాటి ధర ఎంత ఉందో తెలుసుకుందాం. ఇలా చేయడం వల్ల బంగారు, వెండి ఆభరణాలు, నాణేలు తదితరాలు కొనుగోలు చేసేందుకు నగల వ్యాపారుల వద్దకు వెళ్లినప్పుడు దుకాణదారుడు మిమ్మల్ని మోసం చేయలేడు. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి తాజా ధర ఎంతుందో చూద్దాం.
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర
ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ (AIBA) అందించిన సమాచారం ప్రకారం.. నిన్న పసిడి ధరలు భారీగా తగ్గగా.. నేడు అంతకు మించి అన్నట్లుగా పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గితే.. నేడు రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.490 తగ్గితే.. రూ.650 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.80,450గా ఉంది. అక్టోబర్ 28, 2024 నాడు ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.81,100కి చేరుకుంది. శనివారం నాడు 99.9శాతం, 99.5శాతం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ. 81,500, రూ. 81,100 వద్ద ఆల్ టైమ్ హైని తాకింది. మరోవైపు వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర కూడా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండిపై వెయ్యి పెరిగి.. రూ.99,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,06,900గా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలలో 99 వేలుగా నమోదైంది.
గ్లోబల్ మార్కెట్లలో తగ్గుదల ట్రెండ్‌తో నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధరలు తగ్గాయని ఎల్‌కెపి సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో ఉద్రిక్తతలు సడలించే సంకేతాల మధ్య ప్రాఫిట్ బుకింగ్ కనిపించడంతో బలహీనతను కూడా చూసింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకారం, మధ్యస్థం నుండి దీర్ఘకాలికంగా వెండి బంగారం కంటే మెరుగైన పనితీరు కనబరుస్తుంది. రాబోయే 12-15 నెలల్లో వెండి ఎంసీఎక్స్లో కిలోకు రూ. 1.25 లక్షలు , కామెక్స్‌లో ఔన్స్‌కు 40డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని అంచనా.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: On the occasion of dhanteras there is a tradition of buying gold silver metal utensils and new items
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com